గోవా సిఎం మనోహర్‌ పారికర్‌ కన్నుమూత

Goa Chief Minister Manohar Parrikar
Goa Chief Minister Manohar Parrikar

గోవా: గోవా సిఎం మనోహర్‌ పారికర్‌(63) ఆదివారం కన్నుమూశారు. ఆయన దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆదివారం 6.40 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 63 ఏళ్లు. ఆయనకు ఇద్దరు కుమారులు. పారికర్‌ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో శనివారం ఆయనకు కృత్రిమ శ్వాస అందించారు. నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, మూడేళ్లపాటు రక్షణ శాఖ మంత్రిగా విశేష సేవలు అందించారు. నిరాడంబరత, నిజాయతీకి నిలువుటద్దంగా, మితవాద నేతగా ప్రశంసలు అందుకున్నారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ కేంద్ర మంత్రివర్గం సోమవారం ఉదయం పది గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. కేంద్ర ప్రభుత్వం సోమవారం సంతాపదినంగా ప్రకటించింది. దేశ రాజధానితో పాటు అన్ని చోట్లా జాతీయ పతాకాన్ని అవనతం చేయనుంది. సోమవారం సాయంత్రం పనాజీలో పారికర్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/