గిరీశ్‌ కర్నాడ్‌ కన్నుమూత

girish karnad
girish karnad


బెంగళూరు: ప్రముఖ నటుడు, రచయిత గిరీశ్‌ కర్నాడ్‌ పరమపదించారు. బెంగుళూరులోని తన నివాసంలో ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. మహారాష్ట్రలోని మథెరాన్‌లో ఆయన జన్మించారు. రచయితగా అత్యంత ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్‌ అవార్డు ఆయనను వరించింది. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పద్మ భూషణ్‌ అవార్డులతో సత్కరించింది. ఆయన పలు భాషల్లో వచ్చిన సినిమాల్లో నటించారు. పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. తెలుగులో చిరంజీవి నటించిన శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ సినిమాలో గిరీశ్‌ కర్నాడ్‌ ..చిరంజీవి తండ్రిగా నటించి ప్రశంసలు అందుకున్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/