కరోనా వైరస్‌లో జన్యుమార్పులు

భారత్‌లో విస్తరిస్తున్న వైరస్‌ బలహీనమైనది.. శాస్త్రవేత్తలు

corona virus
corona virus

దిల్లీ: ప్రస్తుతం ప్రపంచదేశాలను కరోనా వైరస్‌ గడగడలాడిస్తుంది. దీని దెబ్బకు ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంది. అయితే తాజాగా దీని గురించి శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌ లో విస్తరిస్తున్న కరోనా జన్యుపరంగా బలహీనంగా ఉందని అంటున్నారు. ఈ వైరస్‌ ఇప్పటి వరకు మూడు రకాలుగా మార్పు చెందినట్లు గుర్తించారు. దీనికి ఏ.బి. సి అని పేరు పెట్టారు. మొదట చైనా లో వెలుగు చూసిన వైరస్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో విస్తరించి అక్కడ రెండు రకాల మార్పులకు లోనైనట్లు తెలిపారు. ఆ తరువాత యూరప్‌, అమెరికాలలో విస్తరించిన వైరస్‌లో జన్యుపరంగా చాలా తెడాలు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పోల్చుకుంటే భారత్‌ విస్తరిస్తున్న వైరస్‌ బలహీనంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/