మోగింది నగారా

ఏడు విడతల్లో లోక్‌సభ పోలింగ్‌
ఏప్రిల్‌ 11నుంచి మే 19 వరకు ఎన్నికలు, 23న ఫలితాలు
ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు అసెంబ్లీలకూ పరీక్ష
దేశవ్యాప్తంగా 90 కోట్ల ఓటర్లు

Polling (File)
Voters (File)

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీ అయింది. భారత ఎన్నికల సంఘంప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా 17వ లోక్‌సభకు ఎన్నికల షెడ్యూలును విడుదలచేసారు. నేటినుంచే ఎన్నికకోడ్‌ అమలులోనికి వచ్చింది. ఏడుదశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన కొనసాగుతుందని వెల్లడించారు. ఏప్రిల్‌ 11 వ తేదీనుంచి మే 19వ రకూ ఏడువిడతల ఎన్నికలు జరుగుతాయన్నారు. నేరచరిత్ర ఉన్న అభ్యర్ధులు పోలింగ్‌ తేదీకి ముందుగానే మూడుపర్యాయాలు తమకు సంబంధించిన వ్యక్తిగత చరిత్రలను అందచేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వారిని అనర్హులుగా ప్రకటిస్తామని వెల్లడించారు. ఏప్రిల్‌ 11వ తేదీనుంచి ప్రారంబం అయ్యే ఎన్నికల్లో ఈసారి పలు నిబందనలు కూడా మారుస్తున్నట్లు వెల్లడించారు. సోషల్‌మీడియా ప్రచారం కూడా అభ్యర్ధుల ఖర్చుకిందకు వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటిం చింది. ఫారమ్‌26 అందచేయని వారినిసైతం అనర్హులుగాప్రకటిస్తా మని, విదేశాల్లోఉన్న ఆస్తులు ఆదాయవనరులుసైతం నిక్కచ్చిగా వెల్లడించాలి. అలాగే అఫిడవిట్లతోపాటు పాన్‌కార్డు జెరాక్స్‌నుసైతం అందచేయాల్సి ఉంటుంది. లేదా పాన్‌నెంబరును కూడా స్పష్టంచేయాలి. గత ఎన్నికల్లో తొమ్మిదిలక్షల పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటయితే ఈసారి పదిలక్ష లపోలింగ్‌ కంద్రాలను ఏర్పాటుచేసామని అన్నారు. గత ఎన్నికలకంటే ఈసారి కొత్త ఓటర్లు 8.4 కోట్లమంది పెరిగారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఈసారి ప్రతిపోలింగ్‌కేంద్రంలోనూ వోటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌(వివిపాట్‌)లను ఏర్పాటుచేసామని, దీనివల్ల ఓటరు తాను ఏ అభ్య ర్ధికి ఓటువేసింది కూడా తెలుసుకోవచ్చని వెల్లడించారు. మొదటిదశ ఏప్రిల్‌ 11, రెండోవిడత ఏప్రిల్‌ 18, మూడోవిడత ఏప్రిల్‌ 23, నాలుగోవిడత ఏప్రిల్‌ 29, ఐదోవిడత మే ఆరు, ఆరోవిడత మే 12, ఏడోవిడత చివరి విడత పోలింగ్‌మే 19వ తేదీ జరుగుతుందని, అన్ని దశల ఓట్లలెక్కింపు ఒకేరోజు అంటే మే 23వ తేదీ నిర్వహిస్తామని అరోరా వెల్లడించారు. ఎన్నికల నిమమావళి అమలులో ఉన్నందున ఎలాంటి ప్రభుత్వపరమైన కొత్త నిర్ణయాలనుప్రకటించకూడదని ఆయన పేర్కొన్నారు. అన్ని రాజకీయ ప్రకటనలు, సోషల్‌ మీడియాకు సంబంధించినవాటిని కూడా ముందుగా ధృవీకరణ చేసుకోవాలనికోరారు.

దాదాపు 10 లక్షల పోలింగ్‌ కేంద్రాలు
తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు
అమల్లోకి వచ్చిన కోడ్‌
షెడ్యూలు ప్రకటించిన కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి అరోరా


లోక్‌సభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయి. జమ్ముకాశ్మీర్‌లోమాత్రం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నందునఅక్కడ ఇశాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా కేవలం లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సిఇసి వెల్లడించారు. అనంత్‌నాగ్‌ నియోజకవర్గంలోనే మూడువిడతలుగాఎన్నికలు జరుగుతాయన్నారు. సరిహద్దు సమస్యలు, మిలిటెంట్‌ సమస్యలు, ఉగ్ర దాడుల నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీఎన్నికలు నిర్వహించే పరిస్థితిలేదని, ఈ రాష్ట్ర ఎన్నికలపై తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని సిఇసి వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘంప్రతినిధిబృందం అధికారులు,అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం అయిందని, లోక్‌సభతోపాటు జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంలేదన్నారు. 22 రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకే విడతకిందకు వస్తునఆనయి. కర్ణాటక అస్సాం, మణ ిపూర్‌, రాజస్థాన్‌ త్రిపుర రాష్ట్రాలకురెండుదశల్లో ఎన్నికలు జరుగు తున్నాయి, ఛత్తీస్‌ఘర్‌లోమూడుదశలు ఉంటాయనని కేంద్ర బలగాల నియామకాలకు సంబంధించి ఈ ఏర్పాట్లుచేసినట్లు వివరించారు. గత ఎన్నికల్లో తొమ్మిది విడతలుగాఎన్నికలు జరిగాయి. ఈసారి ఏడుదశల్లో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. మొదటివిడత ఎన్నికల్లో ఏప్రిల్‌ 11వ తేదీ 91 స్థానాలకు 20 రాష్ట్రాల్లో రుగుతాయి. ఎపిలో25 స్థానాలు, అరుణాచల్‌లో రెండు, అస్సాంలో ఐదు, బీహార్‌నాలుగు, ఛత్తీస్‌ఘర్‌ ఒకటి, జమ్ముకాశీమర్‌రెండు, మహారాష్ట్ర ఏడు, మణిపూర్‌ ఒకటి, మేఘాలయ రెండు, మిజోరమ్‌ఒకటి, నాగాల్యాండ్‌ఒకటి, ఒడిశా నాలుగు, సిక్కిం ఒకటి, తెలంగాణ 17, త్రిపుర ఒకటి,యుపి ఎనిమిది ఉత్తరాఖండ్‌ ఐదు, పశ్చిమబెంగాల్‌రెండు అండమాన్‌నికోబార్‌ద్వీపాలకు ఒకటి, లక్షద్వీప్‌ ఒకనియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.
ఇక రెండోదశ ఏప్రిల్‌ 18వ తేదీ 97స్థానాలకు ఎన్నికలు 13 రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. అస్సాంలో ఐదు, బీహార్‌లో ఐదు, ఛత్తీస్‌ఘర్‌లో మూడు, జమ్ముకాశ్మీర్‌రెండు, కర్ణాటక 14, మహారాష్ట్ర పది, మణిపూర్‌లో ఒకటి, ఒడిశాలో ఐదు, తమిళనాడులో 39స్థానాలు, త్రిపురలో ఒకటి, యుపిలో ఎనిమిది, పశ్చిమబెంగాల్‌లో మూడు, పుదుచ్చేరిలో ఒకస్థానానికి ఎన్నికలు జరుగుతాయి. మూడోదశ ఎన్నికల్లో ఏప్రిల్‌ 23వ తేదీ 115స్థానాలకు 14 రాష్ట్రాల్లోపోలింగ్‌ జరుగుతుంది. అస్సాంలో నాలుగు, బీహార్‌లో ఐదు,ఛత్తీస్‌ఘర్‌లో ఏడు, గుజరాత్‌లో అన్ని 26 స్థానాలు, గోవాకు రెండు, జమ్ముకాశ్మీర్‌ ఒకటి, కర్ణాటక 14, కేరళ మొత్తం 20 స్థానాల్లోను, మహారాష్ట్ర 14స్థానాలు, ఒడిశా ఆరు, యుపిపది, పశ్చిమ బెంగాల్‌ ఐదు, దాద్రానాగర్‌ హవేలి ఒకటి, డామన్‌డయ్యు ఒకస్థానానికి పోలింగ్‌ జరుగుతుంది. నాలుగోదశలో ఏప్రిల్‌ 29న తొమ్మిదిరాష్ట్రాల్లో అంటే బీహార్‌ ఐదు, జమ్ముకాశ్మీర్‌ ఒకటి, జార్ఖండ్‌మూడు, ఎంపి ఆరు, మహారాష్ట్రలో 17, ఒడిశాలో ఆరు, రాజస్థాన్‌లో 13, యుపిలో 13, పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది స్థానాలకు జరుగుతున్నాయి. ఐదోదశలో మే ఆరవతేదీ 51స్థానాలు ఏడురాష్ట్రాల్లోపోలింగ్‌ జరుగుతుంది. బీహార్‌లో ఐదు, జార్ఖండ్‌లో నాలుగు, జమ్ముకాశ్మీర్‌లో రెండు, ఎంపిలో ఏడు, రాజస్థాన్‌లో 12,యుపిలో 14, పశ్చిమబెంగాల్‌లో ఏడు స్థానాలకు పోలింగ్‌ ఉంటుంది.
ఇక ఆరోదశలో ఏడురాష్ట్రాల్లో మే 12వ తేదీ 59 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. బీహార్‌లో ఎనిమిది, హర్యానా పది, జార్ఖండ్‌నాలుగు, ఎంపి ఎనిమిది,యుపి 14, పశ్చిమబెంగాల్‌ ఎనిమిది, ఎన్‌సిఆర్‌లోని అంటే ఢిల్లీలోని ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. చివరిగా ఏడోదశ ఎన్నికల్లో ఎనిమిది రాష్ట్రాల్లోని 59స్థానాలకు మే 19వ తేదీ జరుగుతుంది. బీహార్‌లో ఎనిమిది, జార్ఖండ్‌లో మూడు, ఎంపిలో ఎనిమిది, పంజాబ్‌లో 13, పశ్చిమబెంగాల్‌లో తొమ్మిది, ఛండీఘర్‌లో ఒకటి,యుపిలో 13, హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగుస్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తారు. మొత్తం 90 కోట్లమంది అర్హులైన ఓటర్లు ఉండగా, 8.4 కోట్లమంది కొత్త ఓటర్లు ఉన్నారు. పదిలక్షలపోలింగ్‌స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. ఫోటోతో ఉన్న ఓటరు స్లిప్‌ ఓటరు గుర్తింపుకార్డుగా ఎంతమాత్రం ఉండదని, ఇతరత్రా ఎన్నికతలసంగం ధృవీకరించిన పత్రాలతోవెళ్లవచ్చని నఅఆనరు. ఇక నోటా ఆప్షన్‌కు బటన్‌ చిట్టచివరన ఉంటుందని, ఇవిఎంలపై అభ్యర్ధుల ఫోటోలను సైతం మొదటిసారి ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వివిపట్‌లను ఏర్పాటుచేసామని, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎలాంటి ఉల్లంఘనలు చోటుచేసుకున్నా ఎన్నికల సంఘానికియాప్‌, సివిజిల్‌ద్వారా తెలియజేయవచ్చని అన్నారు. సమస్యా త్మకంగా ఉన్న రాష్ట్రాలకు అదనంగా ఎన్నికల పరిశీలకులను పంసిస్తామని అన్నారు. అంగవైకల్యం ఉన్న వ్యక్తులకోసం ప్రత్యేక యాప్‌నుసైతం ప్రవేశపెట్టామని చెప్పారు. ఇక సామాజిక మాద్యమాలపరంగా గూగుల్‌ఫేస్‌బుక్‌సంస్థలు రాజకీయ వ్యాపారప్రకటనలను పరిశీలిస్తామని చెప్పాయని, సోషల్‌మీడియా వేదికలు సైతం రాజకీయ వ్యాపార ప్రకటనలను ముందుగాఎన్నికలసంఘం ధృవీకరించిన తర్వాత ప్రచురించాలని, నోడల్‌గ్రీవెన్స్‌ అధికారులనుసైతం నియమించామని, ఎలాంటి అసభ్యకర విధ్వేషపూరిత ప్రకటనలున్నాచర్యలుంటాయన్నారు.