గంభీర్‌ అలాంటి నీచ వ్యాఖ్యలు చేయడు

గంభీర్‌కు భజ్జీ మద్దతు

harbhajan singh, gautam gambhir
harbhajan singh, gautam gambhir

క్రికెటర్‌ నుంచి పొలిటీషియన్‌గా మారిన టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌కు వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ మద్దతుగా నిలిచాడు. గంభీర్‌ 2019 సాధారణ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, తూర్పు ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆతిషీపై అశ్లీల కరపప్రతాలను గంభీర్‌ విడుదల చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గంభీర్‌పై వచ్చిన ఈ ఆరోపణలపై హర్భజన్‌సింగ్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించాడు. గంభీర్‌పై వచ్చిన ఆరోపణలు విని షాకయ్యాను, అతని గురించి తనకు బాగా తెలుసునని, మహిళల పట్ల అతను అలాంటి నీచ వ్యాఖ్యలు చేయడు అని, అతను ఎన్నికల్లో గెలుస్తాడా లేదా అన్నది అప్రస్తుతం. కానీ అతను మంచి వ్యక్తి అని భజ్జీ ట్వీట్‌ చేశాడు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos