3 రాజధానుల నిర్ణయంతో భవిష్యత్తు అంధకారం: పవన్‌ కల్యాణ్‌

Pawan kalyan

తుళ్ళూరు: రాష్ట్రప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంతో ఆంధ్రప్రజల భవిష్యత్తు అంధకారంలోనికి నెట్టి వేయబడిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.శనివారం తుళ్ళూరు మండలంలోని రైతుదీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం ప్రకటించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంతో ఆంధ్రప్రజల భవిష్యత్తు అంధకారంలోనికి నెట్టి వేయబడిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.శనివారం తుళ్ళూరు మండలంలోని రైతుదీక్షా శిబిరాలను సందర్శించి రైతులకు సంఘీభావం ప్రకటించారు.దీక్షా శిబిరాలను చేరుకొని రైతులతో తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జననేత పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం అప్పుడు అమరావతి రాజధానికి అనుకూలంగా ఉన్నారు.ఇప్పుడు ఇలా వ్యవహరించడం సరైన పద్దతికాదన్నారు.అమరావతి రాజధానికి బిజేపి సానుకూలంగా ఉందని చెప్పారు.

Amaravati Students

ఇక్కడ మంచిపంటలు పండే భూములను రైతులు వైసీపీ నాయకుల నవరత్నాలకు కాదు త్యాగం చేసిందని అన్ని కులాల మతాల వాళ్ళు రాజధాని భూములు త్యాగం చేశారన్నారు.వైసీపీ ప్రభుత్వానికి టిడిపి నాయకులు మీద కోపం ఉంటే వారిపై చూపించాలని రైతుల మీదకాదన్నారు.ఒక్క కలం పోటుతో రాజధాని తరలించడం సాధ్యంకాదని తెలంగాణా నుంచి వచ్చి అక్కడ భూములు అమ్ముకొని ఇక్కడ కొన్నారు వారంతా నష్టపోయారు.రాజధాని తరలి పోతుందని 41మంది ఆవేదనతో ప్రాణాలు కోల్పోయారు ఇది చాలా దారుణం.ఇక్కడ రైతులు 3వేల ఎకరాల భూములు ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చారు.గత టిడిపి ప్రభుత్వానికి రైతులు భూములివ్వలేదు.జగన్‌ ప్రభుత్వం రైతులను నమ్మించి గొంతుకోసిందని విమర్శించారు.రాజధాని అనేది 2014లో నిర్ణయించడం జరిగింది.మూడు రాజధానులు అనేది ఆనాడు చెప్పినట్లేయితే మ్యానిఫెస్టోలో మూడు రాజధానులు అని ముందు చెప్పినట్లేయితే ఓట్లు వేసేవారు కాదన్నారు.రాజధాని విషయం నా ఒక్కడి చేతిలో లేదు.రాజధాని ఇక్కడే ఉండిపోవడానికి చెప్పేందుకు నేనేం సీఎంను కాను అని పవన్‌కల్యాణ్‌ తెలిపారు.రాజధాని ఇష్టారాజ్యంగా మార్చడం తగదని 151మంది ఎమ్మెల్యేలు ఉండి రాష్ట్రాన్ని ఎంతో అభివృధ్ధి చేయాలని కానీ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడం తగదని పవన్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.భవిష్యత్తులో ఏ పార్టీకి అన్ని సీట్లు రాకపోవచ్చు ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని విమర్శించారు.

పోలీస్‌శాఖ అనేది ఒక ఆయుధం దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి పోలీస్‌ శాఖని విచక్షణా రహితంగా వాడి,ప్రభుత్వం కోర్టుకి సంజాయిషీ చెప్పే పరిస్థితి వచ్చింది.మహిళలు,చిన్పపిల్లలు అనేది చూడకుండా లాఠీచార్జీ చేశారు.రెండు పార్టీలు గొడవ వల్ల రైతులను ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.టిడిపి,వైసీపీ మద్య ఉన్న విభేదాల వల్ల రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం కరెక్టు కాదని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే రాజధాని నిర్ణయం ఉంటుందని చెప్పారు.అధికారం ఉందని రాష్ట్రాన్ని 13ముక్కలు చేస్తానంటే కుదరదన్నారు.ప్రభుత్వం విచక్షణా రహితంగా వ్యవహరించాలి.ఈరోజు ఇక్కడ రైతులు రోడ్డేక్కారంటే అది వైసీపీ ప్రభుత్వం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు.

Amaravati Farmers

–టిడిపి ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేస్తే చర్యలు తీసుకోండి.

టిడిపి నాయకులు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌చేస్తే చర్యలు తీసుకోవాలని అంతేకాని రైతులు మానసిక వేదనకు గురి చేయకూడదన్నారు.గత ప్రభుత్వ పనులను ముందుకు తీసుకెళ్ళాలే తప్ప వాటిని మార్చకూడదన్నారు.రాయలసీమ,విశాఖ కి ఒక ఐదు కిలోమీటర్ల రోడ్డువేస్తే అభివృద్ధి అయిపోదు నీ..రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకు మూడు రాజధానుల ప్రకటన చేశారే తప్పా మరోకటి లేదని ఆయన స్పష్టంచేశారు.రాజధాని అంశం ఈ ప్రాంత రైతుల భావోద్వేగంతో ముడిపడి ఉందని కేంద్ర ప్రభుత్వం రైతులకు అనుకూలంగా ఉందని వైసీపీ నాయకులు చెప్పేదాంట్లో నిజం లేదన్నారు.

-జనసేన బిజేపి మిత్రబృందం అమరావతికి కట్టుబడి ఉంది.


కేంద్రప్రభుత్వం మూడు రాజధానికి స్పష్టమైన అధికారం తనకు లేదని రాజధాని అనేది రాజకీయంగా రైతుల కోసం పోరాడే అంశమని దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఏమి చేయలేదని చెప్పుకొచ్చారు.తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భూములను ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి ఇచ్చారు.ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దంన్నర పాటు తెలంగాణాో కోసం పోరాటం చేశారు.పాలకులుచేసిన తప్పులకు ఆంధ్రావాళ్లు,తెలంగాణా వారిచేత తిట్లు తింటున్నారు.రాజధాని ఎక్కడుటే బాగుంటుందో ఆనాడే మేము అమరావతి అని బాగుంటుందని చెప్పాం.స్థానికంగా ఉండే బిజేపిలో రాజధాని పట్ల ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడ్డాం తగదని కొందరు నా దృష్టికి తీసుకొచ్చారు.నాతల్లి,చెల్లి సమవయస్కులైన వారు రోడ్లపైకి వచ్చి ఇలా రోజలు తరబడి పోరాటం చేస్తున్నారు.వీరందర్ని చూస్తుంటే నాగుండె తరుక్కుపోతుందని భావోద్వేగంతో పవన్‌ ప్రసంగించారు.పోరాడే వారిపై అన్యాయంగా పోలీసులు దాడులు చేయడం హింసించడం సరికాదు ఇక్కడి రైతులపై పోలీసులు దాడి చూడలేక ఇక్కడి పరిస్థితి కేంద్రానికి చెప్పేందుకు ఢిల్లీ వేళ్ళాను ఇక్కడి సమస్యలపై పోరాడేందుకు జాతీయస్థాయి నాయకులు రావాలని అని కోరాను.ఇక్కడి రైతుల కష్టాలు గుర్తించి మేము భరోసాగా ఉంటాం.

రాజధాని ఎక్కడ ఉండాలి అనేది 2014లో మోడీ దృష్టికి తీసుకెళ్ళాం.రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు కేంద్రం ఒప్పుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు.మాటలతో పనులు జరగవు,లిఖిత పూర్వకంగా కేంద్రం రాసి ఇవ్వలేదు.గత ప్రభుత్వం పెట్టిన పాలసీలు తీసేయ్యకూడదు,వాటిని అమలు చేయడమే మా వైఖరి అని స్పష్టంచేశారు.నా స్వార్ధం కోసం బిజేపితో పొత్తు పెట్టుకోలేదు.రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి,వాటికోసం పోరాడేందుకు బిజేపితో కలిసాను.ప్రధానమంత్రి,అమిత్‌షాను తగ్గించి వైసీపీ నాయకులు మాట్లాడ్డాం సరికాదు.సిబిఐ వంటి పెద్దస్థాయిలో ఉన్న వాటిని టిడిపి ప్రభుత్వం నిలువరించగలిగింది.రాష్ట్రస్థాయి విధానాలను కేంద్రప్రభుత్వం కూడా నిలువరించిగలరు.ఇక్కడ పోరాడే ప్రతి ఒక్కరికి జనసేన-బిజేపి అండగా ఉంటుంది.మూడు రాజధానులు అనేది ప్రజలను అయోమయానికి గురి చేయడానికే …రాజధాని ఎక్కడికిపోదు..ఇక్కడే ఉంటుంది. మూడు రాజధానులు అనేది ఒక బూటకం.జై అమరావతి అని నేను అనక్కరలేదు. దేశ భవిష్యత్తు కోసం నేను పోరాటం చేస్తున్నాను.

ఈ రోజు జై అమరావతి అనగలను రేపు జై కర్నూల్‌,జై రాయలసీమ అనే ప్రాంతీయ విభేదాలు రావొచ్చు,మీరు భూములిచ్చింది ఒక అమరావతి కోసం కాదు ఐదుకోట్ల ప్రజలకోసం భూములిచ్చారు.బొత్స సత్యనారాయణ ఈ ప్రాంతాన్ని స్మశానంతో పోల్చడం బాధగా అనిపించింది.ఏదైమైనా ఈ ప్రాంత రైతులకు జరిగింది తీవ్రమైన అన్యాయం అని పవన్‌కల్యాణ్‌ తెలిపారు.పవన్‌కల్యాణ్‌ వెంట జేఏసి నాయకులు,ప్రజాప్రతినిధులు ఉన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/