శాఖలకు నిధులు తగ్గించాలి

CM KCR
CM KCR

Hyderabad: పన్నుల వాటా గణనీయంగా తగ్గినందున అన్ని శాఖలకు నిధులు తగ్గించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. రెవెన్యూ, ఆర్థిక అంశాలపై ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. ఖర్చులపై అన్ని శాఖల్లోనూ స్వీయ నియంత్రణ పాటించాలని సీఎం సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక రూపొందించాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర వివరాలతో నివేదికను ఈ నెల 11న జరిగే మంత్రివర్గ భేటీలో ఇవ్వాలని ఆదేశించారు. పన్నుల వాటా ప్రకారం నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కు సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:: https://www.vaartha.com/andhra-pradesh/