తిరుమల శ్రీవారి దర్శనానికి ఉచిత టికెట్లు జారీ

రోజుకు 3 వేల మందికి ఉచిత దర్శనం

tirumala temple
tirumala temple

తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత టికెట్లు జారీ చేసింది. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌ కౌంటర్‌లో భక్తులు బారులు తీరారు. ఈనెల 30వరకు రోజుకు 3వేల చొప్పున టికెట్లు జారీ అయ్యాయి. నేటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల దర్శనాల సంఖ్యను పెంచుతోంది. నేటి నుంచి 11 వరకూ స్వామి వారి దర్శనం భక్తులకు లభించనుంది. కాగా టికెట్లను జారీ చేయనున్నట్లు ప్రకటన వెలువడగానే, భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరికి చేరుకున్నారు. భక్తులంతా భౌతిక దూరం నిబంధనలు పాటించేలా చూసేందుకు అధికారులు తల పట్టుకోవాల్సి వచ్చింది. ఈ నెల 30 వరకూ టికెట్లను జారీ చేశామని, వచ్చే నెల 11 వరకూ ఆన్ లైన్ కోటా టికెట్ల పూర్తయిందని, ఆపై టికెట్లను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/