అస్సాంలో విదేశీయులపై ఆంక్షలు

Assam state
Assam state


న్యూఢిల్లీ: అస్సాంలో చేపట్టిన జాతీయ పౌరసత్వ తుది జాబితా (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్‌ – ఎన్‌ఆర్‌సి) పై వివాదం చెలరేగిన నేపథ్యంలో అస్సాంను కేంద్ర విదేశాంగ, హోంంత్రిత్వ శాఖల పరిధిలో ‘ప్రొటెక్టెడ్‌ ఏరియాగా అధికారులు ప్రకటించారని, విదేశీ జర్నలిస్టులను రాష్ట్రం వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశించారని వెల్లడించారు. విదేశీ జర్నలిస్టులు రాష్ట్రంలో వార్తలు సేకరించాలంటే ముందస్తుగా హోంశాఖ నుండి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అస్సాంలోని అసోసియేటెడ్‌ ప్రెస్‌ జర్నలిస్టు స్వచ్ఛందంగా రాష్ట్రం వదిలి వెళ్లినట్లు అస్సాం ట్రిబ్యూన్‌ చెప్పింది. అస్సాంలో ఇటీవల ఎఆర్‌సిని సవరించినప్పటికీ ఇంకా 19 లక్షల మంది పేర్లు గల్లంతయినట్లు తెలిసిందే. అంతే వీరంతా ట్రిబ్యునల్‌ ముందు హాజరై తాము విదేశీయులం కాదని, భారతీయులమని నిరూపించుకోవాలి. అలా జరగనట్లయితే వారంతా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది.

ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అస్సాంను ‘రక్షిత ప్రాంతంగా ప్రకటించారు. అస్సాంలో ఎన్‌ఆర్‌సి పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని కొన్ని విదేశీ పత్రికలు విమర్శించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక అధికారుల తెలియజేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న విదేశీ జర్నలిస్టులు స్థానిక వార్తలను కవర్‌ చేయాలన్నా, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న విదేశీ జర్నలిస్టులు అస్సాంలోకి రావాలన్నా ముందస్తుగా వివేశాంగ శాఖ లేదా హోంశాఖ అనుమతి తీసుకోవాలని వారు సూచించారు. అయితే పిఎపి – ప్రొటెక్టెడ్‌ఏరియా పర్మిట్‌గానీ, ఆర్‌ఎపి రిస్ట్రిక్ట్‌డ్‌ ఏరియా గానీ తాము జారీ చేయడం లేదని కూడా వారు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించినందున విదేశీ జాతీయులు, విదేశీ పర్యాటకులు కూడా రాష్ట్రాన్ని సందర్శించాలంటే ముందస్తు అనుమతి ఉండాల్సిందేనని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అనుమతి కోరవచ్చని కూడా వారు సూచించారు. ప్రస్తుతం కాశ్మీర్‌లో కూడా ఇలాంటి ఆంక్షలే కొనసాగుతున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/