ముంబయిలో కూలిన వంతెన

CSMT bridge collapse
CSMT bridge collapse

ముంబయి: ముంబయి పాదచారుల వంతెన కుప్పకూలింది. చరిత్రాత్మక ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ (సీఎస్టీ) రైల్వే వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మహిళలుమహిళలు సహా ఐదుగురు మృతి చెందగా 36 మంది గాయపడ్డారు. సాయంత్రం 7.30 గంటల సమయంలో రద్దీ వేళ ఈ ప్రమాదం జరుగడంతో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని దవాఖానలకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. సీఎస్టీ రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్‌ఫాంకు ఉత్తర దిశలో ఉన్న పాదచారుల వంతెనలో ప్రధాన భాగం ఒక్కసారిగా కుప్పకూలిందని ముంబై పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రయాణికులు వంతెనపై వెళుతుండగా, దాదాపు 30 అడుగుల మేర గచ్చు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దాని పై నడుస్తున్న వారందరూ 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయారు. వంతెన కింద నుంచి వెళుతున్న ద్విచక్ర వాహనదారులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు వంతెనకు సమీపంలోని ఒక చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడిందని దీంతో వందల సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయని, లేకపోతే వారిలో చాలామంది బ్రిడ్జి కింద నలిగిపోయేవారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కసబ్ బ్రిడ్జ్‌గా పేరున్న ఆ వంతెనకు ఉదయం మరమ్మతులు జరుగుతుండగానే.. ప్రయాణికులను దానిపై నుండి వెళ్లేందుకు అనుమతించారని మరికొందరు తెలిపారు.


ప్రధాని మోదీ సహా పలువురి సంతాపం

వంతెన కూలిన ప్రమాదంలో ప్రాణ నష్టం జరుగడం పట్ల తీవ్ర ఆవేదనకు గురైనట్టు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మృతు ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. ప్రమాదంపై బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/