భోపాల్‌లో నిమజ్జనంలో అపశృతి

ganesh immersion
ganesh immersion

నీటిలో మునిగిన రెండు పడవలు – అయిదుగురు దుర్మరణం

భోపాల్‌: వినాయక చవితి నుండి పదకొండు రోజుల పాటు పూజలందుకున్న గణపతిని ప్రజలు చెరువులలో, నదులలో నిమజ్జనం చేస్తారు. గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు పడవల్లో బోల్తాపడి అందులోని నీళ్లలో మునిగిపోవడంతో వారిలో కొందరిని కాపాడారు. ఈ ఘటన భోపాల్‌లో జరిగింది. భోపాల్‌లోని లోయర్‌ సరస్సులో గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భక్తులు రెండు పడవల్లో వెళుతుండగా పడవ నీళ్లలో బోల్తా పడి 11 మంది మునిగిపోయి ఆరుగురిని రక్షించినట్లు కలెక్టర్‌ తరుణ్‌ కుమార్‌ పిఠోడె చెప్పారు. విగ్రహాలు నిమజ్జనం చేసే ఖత్లాపూర్‌ ఘాట్‌ వద్ద మొదటి పడవ మునిగిపోగా, అదేవిధంగా రెండో పడవ కూడా మునిగిపోయిందని దాంతో రక్షణ చర్యలు ముమ్మరం చేసినట్లు ఆయన చెప్పారు. ప్రమాదం నుండి బయటపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని హమిది ఆసుపత్రికి తరలించినట్లు పిఠోడె చెప్పారు. రాష్ట్ర న్యాయశాఖ వ్యవహారాల మంత్రి పిసి శర్మ మాట్లాడుతూ ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందని ఘటనపై విచారణ నిర్వహిస్తామన్నారు. పడవ ప్రమాదంలో చనిపోయిన వారికి 4 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తున్నట్లు, ముందుగా రూ.50వేలు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/