ఏనుగు భీబత్సం, ఐదుగురు మృతి

elephant
elephant


భువనేశ్వర్‌: ఒడిశాలో ఓ ఏనుగు భీబత్సం సృష్టించింది. మొత్తం ఐదుగురు వ్యక్తుల్ని తొక్కి చంపింది. ఒకే కుటుంబంలోని నలుగురిపై ఈ ఏనుగు దాడి చేసింది. వీరిలో మహిళ, ఇద్దరు చిన్నారులున్నారు. తాల్చేర్‌ ప్రాంతంలోని సాంధా అనే గ్రామంలో గురువారం రాత్రి ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు గాఢ నిద్రలో ఉన్నారు. అదే సమయంలో ఢెంకానాల్‌ అటవీ ప్రాంతం నుంచి ఏనుగు తప్పించుకుని ఆ ఇంటిపై దాడి చేసింది. నిద్రలో ఉన్న నలుగురినీ తొక్కింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మరలా సంత్‌పద అనే గ్రామంలో మరో వ్యక్తిపై దాడి చేసి చంపింది. అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును అక్కడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/