గ్యాస్‌ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు

Factory blast in Gujarat
Factory blast in Gujarat

వడోదర : గుజరాత్‌ వడోదరలోని పద్రా తాలుకాలో ఉన్న గ్యాస్‌ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఎయిమ్స్‌ ఇండ్రిస్టీస్‌ లిమిటెడ్‌లో శనివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అయిదుగురు వ్యక్తులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమలు, వైద్యరంగానికి అవసరమైన గ్యాస్‌లను కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఆక్సిజన్‌, నైట్రోజన్‌, ఆర్గాన్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఇతర వాయువులను కంపెనీ తయారు చేస్తుంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేపట్టింది. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/