మెట్రోలో ప్రథమ చికిత్సకు ఏర్పాట్లు

Hyd Metro
Hyd Metro


హైదరాబాద్‌: మెట్రో రైలు ప్రయాణికులకు అత్యవసర వైద్యసదుపాయాలు అందనున్నాయి. ప్రయాణంలో ఎటువంటి ఆరోగ్యసమస్యలు తలెత్తకుండా కొద్ది నిమిషాల్లో బాధితుడిని ఆదుకునే మెకానిజం ఏర్పాటు చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రోరైటు సంస్థ మేనేజింగ్‌ డైరెకట్‌ ఎన్విఎస్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణం చేసే సమయంలో ఇబ్బంది తలెత్తినపుడు కోచ్‌లో ఉన్న ఎమెర్జెన్సీ అలారమ్‌ను ప్రయాణికుడు నొక్కగానే ట్రైన్‌ ఆపరేటర్‌ అందుబాటులోకి వస్తారు. నిమిషం వ్యవధిలో తదుపరి స్టేషన్‌కు ట్రైన్‌ ఆపరేటర్‌ సమాచారం అందిస్తారు. ప్రాథమిక చికిత్స చేసేందుకు సిబ్బందితో పాటు అంబులెన్స్‌ ఏర్పాటు చేసి దగ్గరల్లో ఉన్న ఆసుపత్రికి తరలించాలని సూచిస్తారు. అనారోగ్యానికి గురైన ప్రయాణికుడిని అంబులెన్స్‌లోకి తరలించడానికి నిర్ణీత సమయానికి మించి రైలును నిలిపివేస్తామని తెలిపారు. కోచ్‌లతో పాటు అన్ని స్టేషన్లలో ఫస్ట్‌ ఎయిడ్‌ రూమ్స్‌, వీల్‌చైర్‌, ఫైర్‌ బ్లాంకెట్స్‌, వైట్‌ బెడ్‌షీట్స్‌, ఫస్ట్‌ ఎయిడ్‌బాక్స్‌ ఉంటాయని తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/