చెర్నోబిల్‌ సమీపంలోని అడవిలో చెలరేగిన మంటలు

16 రెట్లు పెరిగిన రేడియేషన్‌ స్థాయి

forest burning
forest burning

ఉక్రేయిన్‌: ఉక్రేయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ కేంద్రానికి సమీపంలో ఉండే అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇప్పటికే అక్కడ మంటలు వేగంగా విస్తరిస్తుండడం, రేడియేషన్‌ స్థాయిలు కూడా సాధారణం కంటే 16 రెట్లు నమోదు అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అటవీ ప్రాంతంలో చెలరేగుతున్న మంటలను అదుపుచేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా 1986లో విద్యుత్‌ కేంద్రం భద్రతను పరీక్షీంచేందుకు అప్పట్లో చేసిన ప్రయోగం విఫలం కావడంతో ఒక అణుప్రమాదం సంభవించింది. దీనిని ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర ప్రమాదంగా నిపుణులు అభివర్ణిస్తారు. కాగా ప్రస్తుతం ఈ అణువిద్యుత్‌ కేంద్రానికి 30 కిలోమీటర్ల పరిధి వరకు ప్రజలు నివసించడానికి అనుమతిలేదు. కాని అటవిలో మంటలు చెలరేగుతుండడంతో అధికారులు మంటలను అదుపుచేయడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

తాజి ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/