ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం

Fire-in-Delhi
Fire-in-Delhi

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం లారెన్స్ రోడ్డులోని చెప్పుల ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగడంతో ఫైరింజన్లకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 26 ఫైరింజన్లతో మంటల్ని అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. శనివారం రోజున మాయాపురి ప్రాంతంలోని ఒక చెప్పుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలో ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా గత నెల డిసెంబర్ 8న జరిగిన అనాజ్ మండి ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసే ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో 40కు పైగా మంది మృతి చెందారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/