పంజాబ్‌ మంత్రి సిద్దూపై కేసు నమోదు

Navjot Singh Sidhu
Navjot Singh Sidhu, Punjab minister and Congress leader


పాట్నా: కాంగ్రెస్‌నేత, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్‌లోని కతియార్‌ జిల్లాలో చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాయని భావించిన ఈసి చర్యలకు ఉపక్రమించింది. ముస్లిం సోదరులను ఓట్లు అభ్యర్ధిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పలువురు ఈసికి ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ ..ముస్లింలు 64 శాతం మంది ఉన్నారు. ఓవైసి లాంటి వారి వలలో పడకుండా మీ బలాన్ని గుర్తెరిగి ఓటు వేయాలని, కాంగ్రెస్‌ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి తారిక్‌ అన్వర్‌కు ఓటు వేయాలని , మోదిని ఓడించాలని ప్రజలను కోరారు. దీనిపై స్పందించిన బిజెపి నాయకులు ఆయన వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని ఈసికి ఫిర్యాదు చేశారు. దీంతో బరసో§్‌ు పోలీసు స్టేషన్‌లో ఎన్నికల తనిఖీ విభాగం ఫిర్యాదు మేరకు సిద్ధూపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/