హెల్మెట్ లేని కానిస్టేబుల్‌కు రూ34 వేలు ఫైన్

Traffic constable stopped without helmet
Traffic constable stopped without helmet

Ranchi: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త మోటార్ వెహికిల్ చట్టంతో ఏకంగా సామాన్యుల జేబుకే కన్నమేశారు. దారితప్పి ఆదమరచి రోడ్ మీదకి వస్తే మోత మోగించేస్తున్నారు. అయితే సామాన్యులకే కాదు పోలీసులు కూడా వర్తిస్తుందని గుర్తుచేసే ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్‌లో హెల్మెట్ ధరించని కారణంగా రాకేష్ కుమార్ అనే ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌కు ఉన్నతాధికారులు రూ34 వేలు ఫైన్ విధించారు. హెల్మెట్ లేని కారణంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పత్రాలు లేవని, కొత్త నిబంధనలు ఎవరికైనా ఒకటేనని.. అందరూ ఒక్కటేనని అధికారులు కానిస్టేబులుకి కౌన్సిలింగ్ ఇచ్చారు.