ఎగ్జిట్‌ పోల్స్‌ ..పల్స్‌…

Exit Polls
Exit Polls

ఎగ్జిట్‌ పోల్స్‌.. పల్స్‌…

మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌ఘడ్‌లలో బిజెపికే అనుకూలం
తెలంగాణలో టిఆర్‌ఎస్‌!
రాజస్థాన్‌లో కాంగ్రెస్‌!
మిజోరమ్‌లో హంగ్‌?

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీఎన్నికల్లో బిజెపికి ఎక్కువ మొగ్గుచూపిస్తుంటే తెలంగాణలోమాత్రం కెసిఆర్‌కు మళ్లీ అదికారం ఖాయమన్న సర్వేలు వెల్లడి అవుతున్నాయి. పార్లమెంటరీ ఎన్నికలకు ముందు సెమిఫైనల్‌గా భావిస్తున్న ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలే రానున్న ఎన్నికలకు కీలకం అవుతాయని పరిశీలకుల అంచనాగా ఉంది. గతనెలనుంచి ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎనినకలపరంగాచూస్తే బిజెపి మూడు రాష్ట్రాల్లో పాలనపగ్గాలుచేపడుతుందన్న అంచనా ఉంది.

మోడీ ప్రచారం ఆపార్టీకి మంచి సానుకూలం అయిందని, 2014 లోక్‌సభ ఎన్నికల తరహాలోనే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోకూడా బిజెపికి లెక్కకుమించిన స్థానాలు అందుతాయని అంచనా. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో బిజెపి కాంగ్రెస్‌కు పోటాపోటీగా నడుస్తోంది. ఛత్తీస్‌ఘర్‌లోకూడా ఇదేపరిస్థితి అని సర్వేలు చెపుతున్నాయి. రాజస్థాన్‌లో ఎగ్జిట్‌పోల్స్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. అదే తెలంగాణలో అయితే ముఖ్యమంత్రి కెచంద్రశేఖరరావు ఆధ్వర్యంలోని టిఆర్‌ఎస్‌ మళ్లీ పగ్గాలుచేపడుతుందన్న అంచనాలున్నాయి. మంగళవారం అన్నింటికి లెక్కింపు జరుగుతోంది.

అన్ని రాష్ట్రాలకు ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు శుక్రవారమే విడుదలయ్యాయి. శుక్రవారం రాజస్థాన్‌, తెలంగాణల్లో పోలింగ్‌ముగిసిన తర్వాతనే ఈసర్వేలు వెల్లడయ్యాయి. మిజోరమ్‌కు గతనెలలోనే పోలింగ్‌ ముగిసింది యాక్సిస్‌ మై ఇండియా ఇండియా టుడే, ఆజ్‌తక్‌ సంస్థలు బిజెపికి మద్యప్రదేశ్‌లో 102 నుంచి 120స్థానాలు వస్తాయని అంచనా. అదే కాంగ్రెస్‌ పార్టీకి సైతం 104 నుంచి 122వరకూ రావచ్చని చెపుతున్నాయి. టైమ్స్‌నౌ సిఎన్‌ఎక్స్‌ సర్వే ప్రకారంచూస్తే బిజెపికి 126 సీట్లలో స్పష్టమైన మెజార్టీ ఉందని, కాంగ్రెస్‌కు 89స్థానాలు వస్తాయని గత ఎన్నికలకంటే కొంతమెరుగుపడుతుందని చెపుతున్నారు.

ఇండియా టివిపోల్‌ బిజెపికి 122-13స్థానాలువస్తాయని, 2013లో 165స్థానాలనుంచి కొంత తగ్గవచ్చని, అదే కాంగ్రెస్‌కు 86-92స్థానాలు వస్తాయని అంచనావేసింది. రిపబ్లిక్‌ జన్‌కీబాత్‌ సర్వేలో చూస్తే 108-128 స్థానాలు బిజెపనికి వస్తాయని, 95 నుంచి 111 స్థానాలు కాంగ్రెస్‌కు వస్తాయని అంచనావేసారు. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాల అసెంబ్లీకి మెజార్టీ మార్కు 116గా ఉంది.
అదేఛత్తీస్‌ఘర్‌లో టైమ్స్‌నౌ, సిఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్‌పోల్‌ బిజెపికి మెజార్టీ పలికింది.

46స్థానాలు కాంగ్రెస్‌కు 35 వస్తాయని అంచనా. అజితక్షజోగి, మాయావతి బిఎస్‌పి కూటమి ఏడుస్థానాలు వస్తాయని అంచనావేసింది. ఇంటియా టివి సర్వే కూడా బిజెపికే మొగ్గుచూపించింది. 42నుంచి 50స్థానాలు వస్తాయని ప్రకటించింద.ఇ కాంగ్రెస్‌ 32 నుంచి 38స్థానాలు, జోగి బిఎస్‌పికి ఆరునుంచి ఎనిమిది స్థానాలువస్తాయని అంచనా. సివోటర్‌, రిపబ్లిక్‌ టివిపోల్‌లో చూస్తే గట్టిపోటీ ఉంటుందని వెల్లడించింది. బిజెపికి 35-43స్థానాలు, కాంగ్రెస్‌40–50స్థానాలు ఉంటాయి. జోగి బిఎస్‌పి 3-7స్థానాలుమాత్రమే ఉంటాయి. యాక్సిస్‌ మై ఇండియా ఇండియా టుడే, ఆజ్‌తక్‌ పోల్‌ సర్వేలో కాంగ్రెస్‌ పార్టీకి 55-65స్థానాలు వస్తాయని, బిజెపి 21-31స్థానాలు మాత్రమే అందుకుంటుందని వెల్లడించారు. ఇక మాయావతి జోగి సంయుక్తంగా కేవలం3-8స్థానాలుమాత్రమే అందుకుంటారని అంచనా.

ఛత్తీస్‌ఘర్‌ 90 మంది అసెంబ్లీ స్థానాల్లో ఏపార్టీకైనా 46స్థానాలు రావాల్సి ఉంటుంది. ఇక రాజస్థాన్‌రంగాచూస్తే రెండు ఎగ్జిట్‌పోల్స్‌ కాంగ్రెస్‌ పార్టీకే మొగ్గును చూపించాయి. ఇండియా టుడే, యాక్సిస్‌ మై ఇండియా 119 నుంచి 141స్థానాలు కాంగ్రెస్‌కు వస్తాయని అంచనావేసింది. బిజపికి చెందిన వసుంధరరాజేను గద్దెదించుతాయని అంచనావేసారు. బిజెపి కేవలం 55-72స్థానాలు మాత్రమే దక్కించుకుంటుంది.

పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకావాలంటేకనీసం 100 సీట్లు దక్కించుకోవాల్సి ఉంటుంది. ఒక అభ్యర్ధి మృతిచెందడం ద్వారా అక్కడ ఎన్నిక జరగలేదు. ఇక టైమ్స్‌నౌ, సిఎన్‌ఎక్స్‌ సర్వే కూడా క్గాంరెస్‌కు 105 స్థానాలు, బిజెపికి 85 స్థానాలు వస్తాయని అంచనా. రిపబ్లిక్‌ జన్‌కీబాత్‌పోల్‌లో బిజెపి 83-103స్థానాలు కాంగ్రెస్‌కు 81-101 స్థానాలు లభిస్తాయని అంచనా.
ఇక తెలంగాణలో టైమ్స్‌నౌ సిఎన్‌ఎక్స్‌ పోల్‌ అంచనాలుచూస్తే టిఆర్‌ఎస్‌కు 66 స్థానాలు వస్తాయని అంచనా. 119 స్థానాల్లో ఆపార్టీ లీడ్‌స్థానాలు దక్కించుకుంటుందని అంచనావేసాయి. పార్టీప్రభుత్వం ఏర్పాటుకు 60స్థానాలు కనీసం రావాల్సి ఉంటుంది.

రిపబ్లిక్‌జన్‌కీబాత్‌కూడా కెసిఆర్‌కే ఎక్కువశాతం చూపించింది. 52 నుంచి 65స్థానాలు, టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీకి 38 నుంచి 52స్థానాలు వస్తాయని ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఇతర కూటమి స్థానాలతోసహా మహాకూటమికి 52వరకూ రావడం కష్టమేనని అంచనావేసింది. యాక్సిస్‌ మై ఇండియా ఇండియా టుడే, ఆజ్‌తక్‌పోల్‌ స్థానాల్లోటిఆర్‌ఎస్‌ 79-91 స్థానాల్లో గెలుస్తుందని అంచనా.

కాంగ్రెష్‌ 21-33 స్థానాలతో ఉంటుందని ప్రకటించింది. ఇక రిపబ్లిక్‌ టివి సివోటర్‌ మాత్రం మిజోరమ్‌లో హంగ్‌ అసెంబ్లీ తధ్యమని ప్రకటించాయి. కాంగ్రెస్‌ ఈశాన్యంలో పాలిస్తున్న ఏకైక రాష్ట్రంగా కొనసాగుతోంది. ప్రనతిపక్షంలోని మిజోనేషనల్‌ఫ్రంట్‌కు కొంత అవకాశం ఎక్కువని అంచనా. మిజోరమ్‌లో 40స్థానాలున్న అసెంబ్లీకి ఏకైక మెజార్టీ 21 స్థానాలు రావాల్సి ఉంటుంది.
పార్లమెంటరీ ఎన్నికలకు సెమిఫైనల్‌గా ఈ ఐదురాష్ట్రాల ఎన్నికలను రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవినాటికి లోక్‌సభ ఎన్నికలు జరిగే వెసులుబాటు ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తిరిగి ఎన్నికయ్యేందుకు ఈ ఎన్నికలు కీలకం అవుతాయి. మొత్తంగాచూస్తే బిజెపి మూడు రాష్ట్రాల్లో ఎక్కువ సానుకూలంగా ఉందని అంచనా. ఈ మూడు రాష్ట్రాలే గడచిన 2014 లోక్‌సభ ఎన్నికలకు ఎక్కువ మెజార్టీ స్థానాలను తెచ్చిపెట్టాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘర్‌ రాష్ట్రాల్లో మొత్తం 65 పార్లమెంటు స్థానాలకుగాను 62 స్థానాలు ఈ మూడు రాష్ట్రాలనుంచే బిజెపి గెలుచుకుంది.