విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షించండి

జనవరి 15నుండి మార్చి 23 మధ్య 15 లక్షల మంది రాక..
అందరిని 14 రోజులు క్వారంటైన్‌ లో ఉంచాలని కేంద్రం ఆదేశం

corona effected places
corona effected places

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంబిస్తుండంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంటుంది. జనవరి 15 నుంచి మార్చి 23 వరకు విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచనుంది. వారు నివసిస్తున్న ప్రాంతాలను రెడ్‌ జోన్‌లుగా ప్రకటించాలని సూచించింది. కాగా జనవరి 15 నుండి మార్చి 23 మధ్య కాలంలో 15 లక్షల మంది ఇండియాకు వచ్చినట్టు బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ సమాచారం అందించింది. వీరందరికి పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌ లో పెట్టాలంటూ రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా రాష్ట్రాలకు లేఖలు రాశారు. విదేశాల నుంచి వచ్చిన వారందరూ 14 రోజుల పాటు నిర్బందంలో ఉండేలా చూడాలని అందులో పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/