అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం

Ex Minister P.Chidambaram

New Delhi: ఐఎన్‌ఎక్స్‌-మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్‌ చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసింది. ఢిల్లిdలోని చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. నిన్న హైకోర్టు బెయిల్‌ నిరాకరించడంతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగింది. రాత్రి చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు నోటీసులు అంటించారు. తమ ముందు హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. హైకోర్టు బెయిల్‌ నిరాకరించడంతో చిదంబరం ఇవాళ సుప్రీం కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.