అందరూ ఏకతాటిపైకి రావాలి… ఐరాస

రాజకీయ పట్టింపులకు ఇది సమయం కాదు

antonio guteras
antonio guteras

న్యూయార్క్‌: ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో కొట్టుమిట్టాడుతుంది. దీని కారణంగా ప్రపంచం పెను సంక్షోభాన్ని ఎదుర్కొనబోతుందని ఐక్యరాజ్యసమితి ప్రదాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్దం తరువాత ఈ స్థాయిలో మాంద్యం రావడం ఇదే తొలిసారి కావొచ్చన్నారు. కరోనా పై పోరును మరింత విస్తుృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ దేశాలు రాజకీయ పంతాలను పక్కన పెట్టి ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అలా జరిగితే తప్ప ఈ ఉత్పాతాన్ని ఆపడం సాద్యం కాదన్నారు. ఆరోగ్య రంగంలో వెనకబడిన దేశాలకు అభివృద్ది చెందిన దేశాలు అండగా నిలబడాలని, అవసరమయిన సాయం చేయాలని గుటేరస్‌ కోరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/