కాశ్మీర్‌ కోసం ప్రతి పాకిస్థానీ పోరాటమే: ముషారఫ్‌

Musharraf
Musharraf

ఇస్లామాబాద్‌: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన భారత్‌పై ఆగ్రహంతో ఉన్న పాకిస్తాన్‌ తన వ్యతిరేకతను రకరకాలుగా ప్రదర్శిస్తున్నది. ఈ వ్యతిరేకత మరో మలుపు తిరిగింది. క్రియాశీలక రాజకీయాల్లోకి తిరిగి వస్తున్నానంటూ ప్రకటించిన పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి, రిటైర్డ్‌ జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ కాశ్మీర్‌ అంశంపై మాట్లాడారు. కాశ్మీర్‌ను తమ నుంచి ఎవరూ వేరు చేయలేరని, కాశ్మీరీలను ఆదుకోవడానికి పాకిస్థానీయులు ఎంతకైనా సిద్ధపడతారని, తమదేశ సైన్యం కాశ్మీర్‌ను వదులుకునేందుకు సిద్ధంగా లేదన్నారు. అప్పటి నుండి ఆయన అక్కదే ఉంటున్నారు. మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు ఆయన ఈ మధ్యే చెప్పారు. రాజకీయాల నుండి తాను తీసుకున్న విరామం ముగిసిందని, ఇక స్వదేశానికి వెళుతున్నట్లు చెప్పారు. కార్గిల్‌ యుద్ధ సమయంలోని కొన్ని విషయాలను భారత్‌ విస్మరిస్తోందని, ఆ యుద్ధ సమయంలో భారత ప్రభుత్వం అమెరికా సహాయాన్ని కోరిందని ఆయన ఆరోపించారు.

ఆల్‌ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (ఎపిఎంఎల్‌) పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ఈ విధంగా అన్నారు. జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి హోదా ఆర్టికల్‌ 370తో రద్దయిన తరువాత ఆ అంశంపై ముషారఫ్‌ మాట్లాడటం ఇదే మొదటిసారి. కాశ్మీర్‌ తమ రక్తంలోనే ఉందని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పాకిస్థాన్‌ను దాన్ని వేరే చేయలేరని, చివరి రక్తం బొట్టు వరకు పోరాడటానిని ప్రతి పాకిస్థానీయుడు సిద్ధంగా ఉన్నాడని ముషారఫ్‌ అన్నారు. కాశ్మీర్‌ సమస్య పరిష్కారానికి శాంతియుత వాతావరణంలో చర్చలు జరపాలనే విషయానికి పాకిస్థాన్‌ కట్టుబడి ఉందన్నారు. భారత్‌ ఇందుకు అనుకూలంగా లేదని ఆరోపించారు. ఆర్టికల్‌ 370 రద్దును కూడా ఇందులో భాగమేనన్నారు. కాశ్మీర్‌ విషయంలో భారత ప్రభుత్వం, రాజకీయ నాయకులు, సైన్యాధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. వారి వైఖరి వలేల కాశ్మీర్‌ అంశం మరింత జటిలమైందన్నారు. ఈ పరిష్కారానికి ముందడుగు వేయాల్సిన బాద్యత పాకిస్థాన్‌ కంటే భారత్‌కే ఎక్కువగా ందని ఆయన స్పష్టం చేశారు.
తాజా అంతర్జాతీయ వార్త కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/