కుప్పకూలిన 2 విమానాలు

ఇథియోపియా విమాన ప్రమాదంలో
157 మంది దుర్మరణం
కొలంబియాలో మరో దుర్ఘటన: 14మంది మృతి

Ethiopian Airlines flight bound for Nairobi crashes, all 157 on board killed

నైరోబి: ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కుచెందిన బోయింగ్‌ 737 విమానం నైరోబివద్ద కుప్పకూలిపోయింది. ఆదివారం జరిగిన ఈప్రమాదంలో 149 మందిప్రయాణీకులు, ఎనిమిది మంది క్రూసిబ్బంది ప్రయాణిస్తున్నారు. వీరంతా మృతిచెందారని విమానయానసంస్థ వెల్లడించింది. ఇటి302 నెంబరుగల విమానం నైరోబిలోని బిషోఫ్తు పట్టణం వద్ద కూలిపోయింది. నైరోబి రాజధాని అడ్డిస్‌ అబాబాకు 62 కిలోమీటర్లదూరంలో ఈ విమానం క్పుకూలింది. ఈ విమానం బోయింగ్‌ 737-800 మాక్స్‌ విమానమని, రిజిస్ట్రేషన్‌ నెంబరు ఇటి-ఎవిజె అని సంస్థ ప్రకటించింది. అడ్డిస్‌ అబాబాలోని బోలే ఎయిర్‌పోర్టులో ఉదయం 8.38 గంటలకు బయలుదేరింది. ఎయిర్‌టవర్‌కు సంకేతాలు రాకపోవడంతో విమానసిబ్బందికి హెచ్చరికలుసైతం అందలేదు. 8.44 గంటలకే టవర్‌ సంకేతాలనుంచి అదుపుతప్పిందని ఎయిర్లఐన్స్‌ అధికారులు చెపుతున్నారు. ఇథియోపియా ప్రభుత్వరంగ ఎయిర్‌లైన్స్‌ అయిన ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఈ ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా నడుస్తోంది. గత ఏడాది ఈ ఎయిర్‌లైన్స్‌ 10.6 మిలియన్ల ప్రయాణీకులను రాబట్టుకుంది. 2010 జనవరిలో కూడా ఒక పర్యాయం భారీ విమానప్రమాదం జరిగింది. బీరుట్‌నుంచి బయలుదేరిన విమానం టేకాఫ్‌ అయిన వెను
వెంటనే అదృశ్యం అయింది. ఇదిలా ఉండగా కుప్పకూలిన ఇథియోపియా విమానంలో నలుగురు భారతీయులు కూడాప్రయాణిస్తున్నట్లుతెలిసింది.కెన్యాకు చెందినవారు 32 మంది ఉండగా కెనడాకుచెందినవారు 18 మంది, ఇథియోపియాకు చెందినవారు తొమ్మిది మంది, ఇటలీ,చైనా, అమెరికాలదేశాలకు చెందినవారు ఎనిమిది మంది చొప్పున ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. మొత్తం 32 దేశాలకు సంబంధించిన పాస్‌పోర్టులున్నవారు ఈ ఎయిర్‌లైన్స్‌లోప్రయాణిస్తున్నారు. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితికి చెందినప్రతినిదులు కూడా ఉన్నారు. టేకాప్‌ అయిన వెంటనే అడ్డిస్‌ అబాబాకు 60 కిలోమీటర్ల దూరంలో పంటపొలాల్లో కూలిపోయింది. ఐక్యరాజ్యసమితి నైరోబిలో నిర్వహిస్తున్న వార్షిక సమావేశంరోజుననే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే సమితిప్రతినిదులు ఈ విమానంలో ఎవరైనా ఉన్నారా అననది మాత్రం ధృవీకరించలేదు. ప్రభుత్వరంగంలో నడుస్తున్న ఈ ఎయిర్‌లైన్స్‌ నైరోబికి 10.25 గంటలకు చేరుకోవాల్సి ఉంది.
బిషోప్తు ప్రాంతం సమీపంలోని తులుఫరా వద్ద కూలింది. అనేకమంది మృతదేహాలతోపాటు వారి వస్తుసామగ్రి, విమానభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. విధ్వంసం జరిగిన ప్రాంతంనుంచి రక్షణసిబ్బంది మృతదేహాలను వెలికితీసేందుకు కృషిచేస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న ఎవ్వరూ కూడా బైటపడలేదని అందరూ చనిపోయారని ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి పాస్‌పోర్టులున్నవారు నలుగురుం ఉన్నారు. ఆఫ్రికా 11 మంది, 13 మందియూరోపియన్‌పౌరులు కూడా విమానంలోప్రయాణిస్తున్నారు. ప్రమాదంపై ఇథియోపియా ప్రధాని అభి అహ్మద్‌ కార్యాలయం ప్రగాఢ సంతాపం ప్రకటించింది. కెన్యా అధ్యక్షుడు ఉహ్రూ కెన్యట్టా ప్రమాదంపై విచారం వ్యక్తంచేసారు. తూర్పు ఆఫ్రికా బ్లాక్‌ కార్యనిర్వాహక కార్యదర్శి మహబూబ్‌ మాలిమ్‌ మాట్లాడుతూ ఆఫ్రికా మొత్తం మృతులకుటుంబాలకు సంతాపం ప్రకటిస్తోందని పేర్కొన్నారు. గతఏడాది నవంబరు 15వ తేదీ ఈ విమానం ఇథియోపియాకు పంపిణీచేసారు. జోహాన్స్‌బర్గ్‌నుంచి అడ్డిస్‌అబాబలో మూడుగంటలపాటు పరీక్షలుజరిగిన తర్వాత ఎలాంటి సమస్యలు లేవని ఇథియోపియాకు అప్పగించింది. పైలట్‌ తమకు కొన్ని సమస్యలు వస్తున్నాయని, విమానం వెనక్కి తిప్పేస్తానని చెప్పారని, వెంటనే క్లియరెన్స్‌ ఇచ్చామని సిఇఒ చెప్పారు.
ఇథియోపియా, అమెరికా దేశాల విచారణాధికారులు ఈ విమానప్రమాదంపై దర్యాప్తుచేస్తారని సిఇఒ గెబ్రెమేరియన్‌ వెల్లడించారు. గత ఏడాది అక్టోబరు13వ తేదీ ఇండనేసియాకు చెందిన లయన్‌ఎయిర్‌జెట్‌ కూలిన తరహాలోనే ఈ ్పమాదం జరిగింది. జకార్తానుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఆ విమానంలో 189 ప్రయాణీకకులు చనిపోయారు. గత ఏడాది అక్టోబరులో జరిగినప్రమాదంలో లెబనాన్‌నుంచి వచ్చిన ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం కుప్పకూలడం వల్ల 83 మంది ప్రయాణీకులు,ఏడుగురు సిబ్బంది చనిపోయారు. దుబ§్‌ు లోపనిచేస్తున్న తన కొడుకుకోసం వచ్చిన వ్యక్తిప్రమాద వార్త తెలుసుకని ముందు షాక్‌ అయ్యారు. అయితే కుమారుడు అడ్డిస్‌నుంచి ఫోన్‌చేసి తాను ఆవిమానంలో లేనని చెప్పడంతో కొండంత ఊపిరి పీల్చుకున్నారు.
కొలంబియాలో మరోప్రమాదం
బొగోటా,మార్చి 10: సెంట్రల్‌ కొలంబియాలోప్రయాణీకులతో వెళుతున్న ఒక విమానం కూలిపోయి 14 మంది మృతిచెందారు. 30 సీట్ల సామర్ధ్యం కలిగిన డగ్లస్‌ డిసి-3 విమానం విల్లావెసెన్కోనుంచి టరైరాకు వెళుతుండగా ఈప్రమాదం చోటుచేసుకుంది. 120 కిలోమీటర్ల ఈమార్గంలో 75మైళ్లు ప్రయాణించిన విమానం శాన్‌జోన్‌ డెల్‌ గౌవైరో, విల్లా వెసెన్సియా పట్టణాలమధ్య కుప్పకూలిపోయిందని అధికారులు వెల్లడించారు. టేకాఫ్‌ అయిన వెంటనే కంట్రోల్‌రూమ్‌తో సంబంధాలు తెగిపోయిన గంటసేపు తర్వాత విమానశకలాలను గుర్తించామని ప్రమాదకారణాలు విచారణచేయాల్సి ఉందన్నారు. వాతావరణంలో ప్రతికూలత ఇంజన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలు వంటివిప్రమాదానికి కారణాలని అనుమానిస్తున్నారు. విమానం కూలిపోయిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఎవరూ బతికి బయటపడలేదని మృతులను గుర్తించేప్రక్రియ చేపట్టామని కొలంబియా అధికారులు తెలిపారు.