ఇంగ్లండ్‌కే ప్రపంచకప్‌ గెలిచే అవకాశాలు ఎక్కువ

ricky ponting
ricky ponting

ముంబై: వరల్డ్‌కప్‌లో ఫేవరేట్‌ ఎవరంటే..ఇంగ్లండ్‌ పేరే చెబుతున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌. ఈ సారి గెలిచే అవకాశాలు ఇంగ్లాండ్‌కే ఎక్కువగా ఉన్నాయన్నాడు. దీనికి కారణం ఆ జట్టు ఫుల్‌ ఫామ్‌లో ఉండటమే కారణం. సొంతగడ్డపై ఆడటం..ఆ జట్టుకు కలిసొచ్చే అంశమని తెలిపాడు. ఐతే ఇంగ్లండ్‌ నుంచి భారత్‌, ఆస్ట్రేలియా జట్ల నుంచి గట్టి పోటీ ఉంటుందని హెచ్చరించాడు. ఇంకా ఆ జట్టుకు కలిసివచ్చే అంశాలు మరిన్ని ఉన్నాయని పాంటింగ్‌ తెలిపాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో ఆ జట్టు టాప్‌ ప్లేస్‌లో ఉందని, అంతేగాక తాజాగా పాక్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 4-0తో సాధించి ఫుల్‌ జోష్‌లో ఉందన్నాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/