మరువలేని చీకటి రోజులు

EMERGENCY IN INDIA 1975
EMERGENCY IN INDIA 1975

మరువలేని చీకటిరోజులు

ఆచీకటిరోజులను భారతపౌరులు ఎప్పటికీ మరువలేరు. దేశంలో అంతర్గత కల్లోల పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయన్న సాకులతో ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించిన రోజు. 1975 జూన్‌ 25వ తేదీ నేటికి నలభైమూడేళ్లు కావస్తున్నా చరిత్రపుటల్లో నిలిచిపోతుంది. వేలాది మంది అరెస్టులయ్యారు. పత్రికలపై ఆంక్షలు మొదల య్యాయి. దినపత్రికలు ప్రచురణకుసైతం ఆటంకాలు ఎదుర య్యాయి.

దేశం పరిస్థితి అతలాకుతలం అయిందన్న దృశ్యాన్ని చూపిస్తూ ప్రతిపక్షనేతలు, సొంతపార్టీనేతలు తీవ్ర అభ్యం తరాలుచెపుతున్నా అప్పటిప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ద్రవ్యోల్బణ పరిస్థితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. జిడిపి వృద్ధి 3.5శాతంగా మాత్రమేఉంది. వ్యవసాయ దిగుబడులు 9.5శాతం దిగజా రాయి. డిమాండ్‌ సరఫరాల్లో భారీ వ్యత్యాసం కనిపించింది. ఫలితంగా అప్పటి రాష్ట్రపతి ఆమోదముద్రపడటంతో 25వ తేదీ ఆర్థరాత్రినుంచే అత్యవసరపరిస్థితి ప్రారంభం అయింది. ఒకదశలో 1974లో ద్రవ్యోల్బణం 20.2శాతానికిసైతం చేరింది. 1975లో 25.2శాతానికిచేరిందంటే పరిస్థితులు ఎంత కల్లోలభరితంగా ఉన్నాయో అవగతం అవుతున్నది. పట్టుతప్పు తున్నదని గ్రహించిన నాటిప్రధాని ఇందిరాగాంధీ విస్తృతాధికారా లను ప్రయోగించేందుకు వెనుకంజ వేయలేదు.

ఫలితంగానే అత్యవసరపరిస్థితి, చీకటిరోజులు 21నెలలపాటు దేశంలో రాజ్యమేలాయి. ప్రధాన ప్రతిపక్షపార్టీల నాయకులు ప్రత్యేకించి ప్రభుత్వ విధివిధానాలను ఎండగట్టే నాయకులందరితోను జైళ్లను నింపేసారు. మరికొందరిని గృహనిర్భంధానికి గురిచే సారు. రాజ్యాంగంలోని 352వ అధికరణాన్ని అనుసరించి ఈ అత్యవసర పరిస్థితిని విధించారు. అంతర్గత అత్యవసరపరిస్థి తిగా అప్పటి రాష్ట్రపతి ఈఉత్తర్వులపై సంతకంచేసారు. 359వ అధికరణంకింద ప్రాథమిక హక్కులనుసైతం హరించి వేసే అధికారాలు పాలక ప్రభుత్వానికి ఉన్నాయి. ఫలితంగానే ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయంతో ఆనాటి భారతావని ప్రజాస్వామ్య వ్యవస్థనుంచి రాజ్యాంగ నియంతృత్వ వ్యవస్థకు దారితీసిందని మహామహులైన నాయకులందరూ విమర్శలు చేసారు.

నిరసనవ్యక్తం చేసారు. అయినా ఆగలేదు. అనాడు ఇందిరాగాంధీ ప్రమాదకరమైన నిర్ణయం చేపట్టారని అప్పట్లో ప్రముఖ న్యాయవాది కుటుంబంనుంచే వచ్చిన అరుణ్‌జైట్లీ వంటి నేతలుసైతం సత్యాగ్రహానికి దిగారు. ఫలితంగా వీరంతా తీహార్‌జైలుకు వెళ్లారు. విద్యార్ధులు, ప్రతిపక్ష పార్టీలు ఒకటేమిటి అన్నివర్గాలు ప్రతిఘటించినా చీకటిరోజులు అలుము కున్నాయి. సుమారు 21 నెలలపాటు కొనసాగిన అత్యవసర పరిస్థితిలో దేశప్రజలు అనూహ్యపరిస్థితులను ఎదుర్కొ న్నారు. భారతచరిత్రలో ఒక చీకటిఅధ్యాయంగానే చెప్పాలి. రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం సిఫారసుతో రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని విధించాలి. అయితే ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ మంత్రివర్గాన్ని సైతం సంప్రదించకుండా అత్యవసరపరిస్థితిని విధించాలని రాష్ట్రపతికి లేఖద్వారా సిఫారసుచేసినట్లు ఇప్పటికీ నేతలు చెపుతుంటారు.

అంతర్గతకల్లోలాలద్వారా దేశ భద్రతకు తీవ్ర ముప్పుపొంచి ఉందని అందువల్ల తక్షణ ప్రాధాన్యత దృష్ట్యా దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని ఆనాడు ఇందిరాగాంధీ రాష్ట్రపతికి సూచించారు. గుజరాత్‌లో నవ్‌ నిర్మాణ్‌ ఆందోళన్‌గా పేరుపొందిన అవినీతి వ్యతిరేక ఉద్య మంతో ప్రజావ్యతిరేకత పెరుగుతుందన్న ఆదుర్దా పెరిగిన ఆనాటి కాంగ్రెస్‌ పాలకులు దేశంలో తప్పుడు సిఫారసులపై ఆధారపడి అత్యవసర పరిస్థితి విధించారని సీనియర్‌ ప్రతిపక్షనేతలందరూ విమర్శించినా ఇందిరాగాంధీ పెడచెవిన పెట్టారు. అధికధరల, అవినీతిపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి.

విద్యార్ధి ఉద్యమాలు చెలరేగాయి. అత్యవసరపరిస్థితి విధించేందుకు ముందు 15రోజులక్రితమే ఆనాటి అలహాబాద్‌కోర్టు న్యాయమూఐర్తి ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఆమె ఎన్నిక చెల్లనేరదని తీర్పునిచ్చారు. ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించారు. సుప్రీంకోర్టులో అప్పీలుకు అవకాశం ఇచ్చారు. దీనితో అప్పట్లోప్రతిపక్షాలన్నీ ఆమె రాజీనామాచేయాలని డిమాండ్‌చేసాయి. తదనంతరం సుప్రీంకోర్టు షరతులతోకూడిన స్టే మంజూరుచేయడంతో కొంత ఊరట లభించినా పార్లమెంట్‌ చర్చల్లో పాల్గొనడం, ఓటువేయడం వంటివి చేయకూడదని ఆదేశించడంతో ఇందిర చేతులు కట్టేసినట్లయింది.

శాంతిభద్ర తలు పూర్తిగా అదుపులోనే ఉన్నా అంతర్గత కల్లోలాలపేరుతో జూన్‌ 25నరాత్రి అత్యవసరపరిస్థితిని విధించారు. అప్పటి కప్పుడు జయప్రకాష్‌నారాయణ్‌, మురార్జీదేశా§్‌ు, వాజ్‌పేయి, అద్వాని, మధుదండావతే, ఆర్‌కెహెగ్డే,చంద్రశేఖర్‌, చరణ్‌సింగ్‌, నానాజీ దేశ్‌ముఖ్‌, దేవెగౌడ, నితీష్‌కుమార్‌తోపాటు అనేక మంది అత్యున్నతస్థాయి నేతలుసైతం అరెస్టులపాల య్యారు. అంతర్గత భద్రతాచట్టం(మీసా)పరిధిలోనే వీరందరినీ అరెస్టు చేసారు. ప్రాథమిక హక్కులు రద్దయ్యాయి. న్యాయవ్యవస్థను ఉల్లంఘించడం వంటివాటిపై కఠినచర్యలు, సంస్థలపై నిషేధం, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరపడం వేలాదిమందిని నిర్బంధించి చిత్రహింసల పాలుచేయడం వంటివి కోకొల్లలుగాజరిగాయి.

అక్కడితో ఆగలేదు రాజ్యాంగా నికి చేసిన ఏసవరణ అయినా ఏకోర్టులోనూ ప్రశ్నించేందుకు వీలులేకుండా 42వ రాజ్యాంగసవరణ జరిగింది. చట్టసభల కాలపరిమితిని ఐదునుంచి ఆరేళ్లకు పొడిగించారు. ఇందిర వందిమాగధులు అప్పట్లో అంతా సవ్యంగా ఉందన్న రహస్య తప్పుడు నివేదికలివ్వడంవల్లనే దేశంలోను, విదేశాలనుంచి అంటే ప్రపంచదేశాలనుంచి నిరసన వ్యక్తం అయింది. అంతేకాకుండాప్రజలనుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి నెలకొన్నది.

అన్నివైపులనుంచి ఎదురయిన ఒత్తిళ్లతో ఇక చివరకు 1977 ఎన్నికలకు సిద్ధం అయిన ఇందిరాగాంధీని ప్రజలు చిత్తుగా ఓడించి జనతాప్రభుత్వాన్ని అధికారంలోనికి తీసుకువచ్చారు. భారతప్రజలు శాంతికాముకులైనప్పటికీ నియంతృత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోను సహించరనడానికి చరిత్రపుటల్లో నిలిచిన అత్యవసరపరిస్థితి సంఘటనలు ఒక సజీవసాక్ష్యంగా నిలుస్తాయని నిష్కర్షగా చెప్పగలం.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌