ఎలక్ట్రిక్‌ బస్సులతో ఢిల్లీ కాలుష్యానికి చెక్‌

ANGELA MARKEL
ANGELA MARKEL

న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రమాదస్థాయికి చేరిన కాలుష్యంతో అక్కడి ప్రభుత్వం నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని, పాఠశాలలకు నవంబర్‌ 5 వరకు సెలవులు ప్రకటించింది. రెండు రోజుల పర్యటనకు వచ్చిన జర్మన్‌ ఛాన్సెల్‌ ఏంజెలా మెర్కెల్‌ ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ కాలుష్యంపై ఏజెంలా మెర్కెల్‌ మాట్లాడుతూ డీజిల్‌తో నడిచే బస్సులను ఎలక్ట్రికల్‌ బస్సులుగా మారిస్తే మంచిందని ఆమె అభిప్రాయపడ్డారు. భారత్‌, జర్మన్‌ భాగస్వామ్య ప్రాజెక్టులో భారత్‌లో వచ్చే అయిదేళ్లలో హరిత నగర చైతన్యానికి ఒక బిలియన్‌ యూరోలు అనగా రూ.8వేల కోట్ల మార్పిడి జరుగుతుందని మార్కెల్‌ చెప్పారు. తమిళనాడులో బస్‌ సెక్టర్‌కు 200 మిలియన్‌ యూరోలు కేటాయించనున్నట్లు చెప్పారు. డీజిల్‌ బస్‌ల స్థానంలో ఎలక్ట్రిసిటీ బస్‌లను నడపాలని ఆమె ఏంజెల్‌ సూచించారు. రాజధాని నగరం (ఎన్‌సిఆర్‌)లో 484కు చేరి వాయు నాణ్యత సూచిక ప్రకారం భవిష్యత్తులో మరింత కాలుష్యం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాలను ఎమర్జెన్సీ జోన్‌లుగా ప్రకటించారన్నారు. పొగమంచు, కలుషితమైన గాలితో ఢిల్లీ నగరం ఎమర్జెన్సీ జోన్‌గా మారింది. రక్షణ, సాంకేతికత, వాతావరణ మార్పు, ప్రాంతీయ రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు వంటి అంశాలపై భారత్‌, జర్మనీలు ఒప్పందం చేసుకుంటాయన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/