భారత్‌ ప్రపంచ దేశాలకు ఆదర్శం

mike pence, mike pompeo
mike pence, mike pompeo

వాషింగ్టన్‌: భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించారని అగ్రరాజ్యం అమెరికా పొగిడింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ తన ఎన్నికల నిర్వహణతో ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా నిలిచిందని అగ్రరాజ్యం అమెరికా వెల్లడించింది. రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోదికి అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజాస్వామ్యానికి భారత ప్రజలు అమితంగా కట్టుబడి ఉన్నారన్న దానికి నిదర్శనమని ఆయన అన్నాఉ. అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కూడా మోదికి విషెస్‌ తెలిపారు. భారత్‌ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. భారత్‌తో మరింత స్వేచ్ఛగా, భద్రంగా పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు పెన్స్‌ చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/