నిర్భయ దోషుల ఉరితీతకు ట్రయల్స్‌

మూడో నెంబరు జైల్లో ఏర్పాట్లు

nirbhayas-convicts
nirbhayas-convicts

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు మరణశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉరి శిక్షను అమలు చేసేందుకు జైలు సిబ్బంది ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు తిహార్‌ జైలు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే బీహార్ నుంచి ప్రత్యేకమైన ఉరితాళ్లు రాగా, వాటితో ఉరితీత ట్రయల్ వేసి చూడాలని నిర్ణయించారు. దోషుల బరువుకు సమానమైన బరువులను ఆ తాళ్లకు కట్టి ప్రయోగాత్మకంగా ఉరితీస్తారు. తద్వారా తాళ్లలో కానీ, ఉరికొయ్యలో కానీ ఏవైనా లోపాలుంటే బయటపడే వీలుంది. తీహార్ ప్రాంగణంలోని మూడో నెంబరు జైలు ఈ ట్రయల్స్ కు వేదిక కానుంది. ఈ ముందస్తు సన్నాహాల్లో జైలు సూపరింటిండెంట్ సహా అధికారులు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ అధికారులు పాల్గొంటారని తెలుస్తోంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/