ముంబైలో రూ. వెయ్యి కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం

ఇద్దరు నిందితుల అరెస్టు

drugs seized In Mumbai
drugs seized In Mumbai

Mumbai: నవీ ముంబైలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ), కస్టమ్స్‌ అధికారులు సోమవారం భారీ డ్రగ్స్‌ రాకెట్‌ను ఛేదించారు.

నవీ ముంబై నవ షేవా ఓడరేవు నుంచి భారీగా మాదక ద్రవ్యాలు దిగుమతి అవుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు.

సుమారు రూ.1,000 కోట్ల విలువైన 191 కిలోల మాదక ద్రవ్యాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

పైపుల లోపల మాదక ద్రవ్యాల పొడిని కూర్చి రవాణా చేస్తున్నారని, మార్కెట్లో దీని ఖరీదు కిలోకు రూ.5 కోట్లకుపైగా ఉంటుందని పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్తాన్లో అక్రమంగా కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల కస్టడీ విధించారు.

నిందితులను విచారిస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/