వైశ్‌ ఫెడరేషన్‌కు రాష్ట్రపతి అభినందన

DR GIRISH KUMAR SANGHI WITH PRESIDENT RAMNATH
ఆదివారం రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన ఆల్‌ ఇండియా వైశ్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు,మాజీ ఎంపీ డాక్టర్‌ గిరీష్‌కుమార్‌ సంఘీ బృందం

వైశ్‌ ఫెడరేషన్‌కు రాష్ట్రపతి అభినందన

హైదరాబాద్‌: ఆల్‌ ఇండియా వైశ్‌ ఫెడరేషన్‌ (ఎఐవిఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు,మాజీ ఎంపీ డాక్టర్‌ గిరీష్‌కుమార్‌ సంఘీ ఆదివారంనాడు రాజ్‌భవన్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఫెడరేషన్‌ కార్యవర్గ సభ్యులు కూడాఉన్నారు. రాష్ట్రపతికి ఫెడరేషన్‌ తర ఫున ఒక మెమోంటోను అందజేశారు. అనంతరం రాష్ట్రపతి వైశ్‌ఫెడరేషన్‌ దేశానికి చేస్తున్న సేవలను, స్వచ్చంధ కార్యక్రమాలను అడిగి తెలుసుకుని సంతోషం వ్యక్తంచేశారు.

జాతి నిర్మాణంలో వైశ్‌ ఫెడరేషన్‌ నిర్వహిస్తున్న అమోఘమైన పాత్రను ఆయనఅభినందించారు.గత 9 సంవత్సరాలుగా వైశ్‌ ఫెడరేషన్‌ అంతర్జాతీయ స్థాయి సమావేశా లను కొనసాగిస్తున్నామని, ఈసందర్భంగా వివిధ దేశాల్లో ప్రతిఏటా 15వఆగస్టున భారతస్వాతంత్ర దినోత్సవేడుకలను నిర్వహిస్తున్నామని ఫెడరేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ గిరీష్‌ కుమార్‌ సంఘీ రాష్ట్రప తికి తెలిపారు. విదేశాల్లో భారతస్వాతంత్య్ర వేడు కల సందర్బంగా భారతసంస్కృతిని చాటుతున్నా మని, ఆయాదేశాలసంస్కృతినికూడా తెలుసుకుం టున్నామని వివరించారు. ప్రతి సంవత్సరం 15వఆగస్టున ఏదోఒకదేశంలోపర్యటన చేస్తామని, ఈసారి పిలిప్సైన్స్‌ వెడతున్నామని చెప్పారు. ప్రతిఅంతర్జాతీ§ సమావేశా నికి స్థానికులతోసహా 300మందిప్రతినిధులుహాజరవుతున్నారని తెలిపారు.