అలా సంతృప్తి చెందితేనే ఓటు వేయండి

మా ప్రభుత్వం చేపట్టిన పనులతో సంతృప్తి చెందితేనే ఓటు వేయండి

arvind-kejriwal
arvind-kejriwal

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఢిల్లీకి అంసెబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తరువాత రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. వివిధ రాజకీయపార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత, ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తమ ప్రభుత్వం చేపట్టిన పనులతో సంతృప్తి చెందితేనే తమకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లిలో పోలీసులను, మున్సిపల్‌ కార్పొరేషన్‌, డిడిఎలను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుంటుందని ఆయన చెప్పారు. విద్య, విద్యుత్తు, రోడ్లు, నీటి సరఫరా, నిర్మాణాలకు సంబంధించి మాత్రమే తమ ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆయన అన్నారు. ప్రజలు ఇప్పుడు ఏ పార్టీ బాగా పని చేసిందనే విషయాన్ని నిర్ణయిస్తారని ఆయన అన్నారు. తాము ఏమీ చేయలేదని ప్రజలు భావిస్తే తమకు ఓటు వేయవద్దని ఆయన అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/