దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె

నాలుగోరోజుకు చేరిన బెంగాల్‌ డాక్టర్ల నిరసన

doctor's strike
doctor’s strike

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజి, ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యులపై దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వైద్యులు శుక్రవారం సమ్మెకు దిగారు. ఎయిమ్స్‌ రెసిడెంట్‌ సంఘం పిలుపు మేరకు డాక్టర్లు సమ్మె చేపట్టారు. ఢిల్లీ సహా ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర ప్రధాన నగరాల్లో వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. దేశ రాజధానిలో పలువురు రెసిడెంట్‌ వైద్యులు జంతర్‌ మంతర్‌ వద్దకు చేరి నిరసన చేపట్టారు. మరోవైపు పశ్చిమబెంగాల్‌లో జూనియర్‌ వైద్యుల సమ్మె నాలుగో రోజుకు చేరడంతో, సమ్మె విరమించాలని ఆ రాష్ట్ర సియం మమతాబెనర్జీ హెచ్చరించారు. కాని వైద్యులు ఖాతరు చేయలేదు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంతవరకు విధుల్లో చేరేది లేదని తేల్చి చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/