ధావన్‌ జట్టులోకి రావడంపై వెంగ్‌సర్కార్‌ ఆందోళన

veng sarkar
veng sarkar

లండన్‌: ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌ ప్రస్తుతం గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ధావన్‌ పునరాగమనంపై భారత మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. గాయం నుంచి ధావన్‌ కోలుకున్నప్పటికి మునుపటి ఫామ్‌ను ప్రదర్శించడం కష్టమని వెంగ్‌సర్కార్‌్‌ అభిప్రాయపడ్డారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రస్తుతం టీమిండియా 14 మంది ఆటగాళ్లతోనే ప్రపంచకప్‌లో రాణిస్తుంది. ఐతే మిడిలార్డర్‌లో సరైన బ్యాట్స్‌మెన్‌ లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో నంబరు ఆటగాడిగా వచ్చిన విజయ్‌శంకర్‌ బంతితో ఆకట్టుకున్నా..బ్యాటింగ్‌లో ఇంకా మెరుగుపడాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో రిషబ్‌పంత్‌కి బదులు అజింక్యా రహానేను సెలక్టర్లు ఎంపిక చెయ్యాల్సిందని వెంగ్‌ సర్కార్‌ చెప్పుకొచ్చాడు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/