కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అరెస్ట్‌

21 మంది రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు బెంగళూరుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్

Digvijaya Singh placed under preventive arrest
Digvijaya Singh placed under preventive arrest

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బెంగళూరులోని ఓ హోటల్ లో మకాం వేసిన మధ్యప్రదేశ్ రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లిన  ఆయని హోటల్ సమీపంలో పోలీసులు అడ్డుకోగా, ఆయన రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో ఆయను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి, అమృతహల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు అంతకుముందు బెంగళూరుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ కు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ స్వాగతం పలికారు. ఆపై వారిద్దరూ కలిసి హోటల్ వద్దకు వెళ్లగా, ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం దిగ్విజయ్ మాట్లాడుతూ, తాను ఎంపీనని, 26న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, తమ ఎమ్మెల్యేలను ఇక్కడ దాచేస్తే, వారితో మాట్లాడాలని తాను వచ్చానని, కానీ పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. వాళ్లు వెనక్కు తిరిగి వస్తాననే తాను భావిస్తున్నానని, తమ ఎమ్మెల్యేలను బలవంతంగా ఇక్కడ నిర్బంధించారని ఆరోపించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/