కేరళలో మళ్లీ అన్ని దేవాలయాలు బంద్‌ !

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కేరళ దేవస్థానం బోర్డు నిర్ణయం

Kerala- Temple

తిరువనంతపరం: కేరళలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈరోజు నుండి జూన్ 30 వరకు భక్తులను దేవాలయాల్లోకి అనుమతించబోమని కేరళ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. కరోనా నివారణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. జూన్ నెలాఖరు తర్వాత పరిస్థితులను బట్టి తగు నిర్ణయం తీసుకుంటామని బోర్డు వెల్లడించింది. కాగా.. దేవాలయాల్లో రోజువారీగా పూజా కార్యక్రమాలు యథావిథిగా జరుగుతాయని వివరించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/