రూ. 40వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం

DEVINENI-
DEVINENI-

రూ. 40వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం

ముప్పాళ్ల సమీపంలో రూ.35కోట్ల్ల వ్యయంతో ఎత్తిపోతల పథకం: మంత్రి దేవినేని

నందిగామ: రాష్ట్రంలో వచ్చే ఏడాది నాటికి 14లక్షల జీప్లస్‌ త్రీ ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేసి సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రయోజనదారుల సొంత ఇంటికలను సాకారం చేసేందుకు ప్రభుత్వ స్దిర నిశ్చయంతో ఉందని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.ఇందు కోసం రూ.40వేలకోట్లును వ్యయం చేస్తుందన్నారు. శనివారం నందిగామ పట్టణశివారుల్లోని హను మంతుపాలెంలో నిర్మిస్తున్న సుమారు రెండువేల ఎన్టీఆర్‌ జీ+త్రీ ఇళ్ళ నిర్మాణానిక,ముప్పాళ్ళ సమీపంలో రూ.35కోట్ల్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేసారు. స్థానిక రైతుబజారులో అన్న క్యాంటీన్‌, అనాసాగరంలో కుట్టుమిషనుల పంపిణీ కార్య క్రమాన్ని,ఎఎంసీలో సిసిఐ పత్తికొనుగోలు కేంద్రాన్ని ఆయన విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్‌(నాని),ఎంఎల్‌ఎ తంగిరాల సౌమ్యతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల వద్ద నిర్వహించిన సభల్లో దేవినేని ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సొంత ఇంటిని కలిగివుండటంతో పాటు తిండికి గుడ్డకు ఇబ్బందిలేకుండా వుండాలన్నది దివంగత ఎన్టీఆర్‌ స్వప్నమన్నారు.ఆ కలలను సాకారం చేయటం చంద్రబాబు లక్ష్యమన్నారు. ప్రభుత్వ రాయితీలు,బ్యాంకు రుణాల కల్పన ద్వారా స్వయంగా ఎల్‌ఎన్‌టి సంస్దద్వారా నిర్మించి ఇస్తున్న ఆధునీక అపార్ట్‌మెంటు తరహా ఇళ్లు దేశంలో మరెక్కడా లేవన్నారు.అత్యంత నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణం జరుగు తుందన్నారు.ఈ విషయంలో అనుమానాలుంటే సీసీ కేమేరాల ద్వారా పర్యవేక్షణ ఏర్పాటు చేస్తామన్నారు.స్థానికంగా ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి స్థానిక జిడిఎంఎం ఇంజినీరింగ్‌ కళాశాల అధినేతకు పర్యవేక్షణ బాధ్యతను అప్పగిస్తున్నామని,ఆయన,ఇంజినీరింగ్‌ కళాశాల సివిల్‌ విద్యార్దులు నిత్యం ఇళ్ల నిర్మాణాన్ని గమనించాలన్నారు,నందిగామలో దివంగత మంత్రి దేవినేని వెంకటరమణ కలలు సాకార మవుతున్నాయన్నారు. గతంలో నాలుగువేల కుటుంబాల ప్రయోజనం కలిగే రీతిలో రమణ కాలనీ నిర్మాణం జరిగిందన్నారు. దివంగత రమణ, దివంగత శాసనసభ్యులు తంగిరాల ప్రభాకరరావు అమరులయినా,వారి దివి నుంచి సైతం తమ ప్రాంత అభివృద్దికి ఆశ్శీస్సులు అందిస్తున్నారన్నారు.అన్నా క్యాంటీన్‌ల ద్వారా పేద వారికి రూ.అయిదుకే అల్పాహరం,భోజనం లభిస్తున్నాయన్నారు. నందిగామలో రూ.35లక్షలతో నిర్మించిన అన్నా క్యాంటీన్‌ తొలిరోజు అరవింద్‌చారిటబుల్‌ ట్రస్టు ద్వారా ఎఎంసీ చైర్మన్‌ నాలుగు వందల మందికి భోజనాన్ని అందించటం ప్రశంసనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు నిర్వాహణకు ప్రభుత్వం రూ.వేల కోట్లు వెచ్చిస్తుందన్నారు.