మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం ఎందుకు:సుప్రీం కోర్టు

Delhi Metro Trains
Delhi Metro Trains

New Delhi: ఢిల్లీ మెట్రో రైలులో మహిళలకు ఉచిత ప్రయాణం ఎందుకని సుప్రీం కోర్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోర్టు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆర్ధిక పరిస్థితి దెబ్బ తినే విషయం ప్రభుత్వం ఆలోచించలేదని పేర్కొంది. ఇలాంటి ఉచిత ప్రయాణం మెట్రోకు భారీగా నష్టాలు తెచ్చి పెడుతుందని వ్యాఖ్యానించింది. ప్రజాధనం ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రతిపాదనను ఎంసీ మెహతా అనే అతను వ్యతిరేకించి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు. ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఇదివరకే తిరస్కరించింది.