కేజ్రీవాల్‌ పథకాన్ని తోసిపుచ్చిన ఢిల్లీ మెట్రో

delhi metro
delhi metro

న్యూఢిల్లీ: మహిళల కోసం కేజ్రీవాల్‌ సర్కార్‌ ప్రకటించిన మెట్రో ఉచిత ప్రయాణ సౌకర్యం పథకానికి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ రెడ్‌ సిగ్నల్‌ వేసింది. దీనివల్ల మెట్రోకు ఏటా రూ. 1560 కోట్ల నష్టం చేకూరుతుందని లెక్కలు వేసింది. పథకానికి సంబంధించి ఎనిమిది పేజీల నివేదిక రూపొందించిన మెట్రో అధికారులు..ఢిల్లీ సర్కార్‌ నిర్ణయం సముచితం కాదని..ఉచిత ప్రయాణ పథకాన్ని దుర్వినియోగమవుతుందని హెచ్చరించారు. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎన్నడూ ప్రయాణీకులకు కేటాయించిన దాఖలాలు లేవు. బిజెపి ఈ ఉచిత ప్రయాణంపై మండిపడుతుంది. నిజంగా కేజ్రీవాల్‌ సర్కారుకు మహిళా సాధికారతపై దృష్టి ఉన్నట్లైతే గతేడాది ఈ పథకాన్ని ప్రవేశ పెట్టకుండా, ఇప్పుడే ఎందుకు ప్రవేశపెట్టినట్లు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ పథకాన్ని తీసుకొచ్చారని విమర్శించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/