తెలంగాణకు ఆర్థిక సాయం ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం

cm-arvind-kejriwal

న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరద బీభత్సంతో హైదరాబాద్‌ అతలాకుతలమవుతుంది. ఈనేపథ్యంలోనే ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. వరదల వల్ల హైదరాబాద్ అతలాకుతలం అయిపోయిందన్న ఆయన ఇలాంటి సమయంలో తన సోదర, సోదరీ మణులైన హైదరాబాదీలకు అండగా ఉంటామన్నారు. వర్షాల కష్టాల నుంచి హైదరాబాద్ బయటపడేందుకు తమ ప్రభుత్వం తరపున రూ.15 కోట్లను ఆర్థిక సాయంగా ఇస్తున్నట్లు ట్వీట్ ద్వారా ప్రకటించారు. ఈ డబ్బు సహాచక చర్యలకు ఉపయోగపడుతుందని ఆశించారు.

రూ.15 కోట్ల సాయం ప్రకటించిన కేజ్రీవాల్‌కు తెలంగాణ ప్రజల తరపున సిఎం కెసిఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కేజ్రీవాల్‌కు కెసిఆర్‌ ఫోన్ చేసి మాట్లాడారు. కేజ్రీవాల్ ఎంతో ఉదారత చాటుకుని అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దానికి అదనంగా తూర్పు బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడింది. తెలంగాణలో మరో మూడ్రోజులు సాధారణ, మోస్తరు వర్షాలు కురవనుండగా గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం రెండ్రోజులు అక్కడక్కడా భారీ లేదా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు క్లారిటీగా చెప్పారు. దాంతో ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/