ఫైనల్‌కి వెళ్లి తీరుతాం

MS dhoni
MS dhoni

చెన్నై: తాము ఖచ్చితంగా ఫైనల్‌కు చేరుకుంటామని చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఆశాభావం వ్యక్తం చేశారు. చెన్నై వేదికగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్‌-1 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. జట్టులో మంచి బ్యాట్స్‌మెన్‌ ఉన్నారని, పలు మ్యాచ్‌ల్లో తాము బాగా బ్యాటింగ్‌ చేశామని, అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌ ఉన్నా మంచి షాట్లు ఆడలేకపోయామని అన్నారు. తర్వాతి మ్యాచ్‌లో తాము మెరుగైన ప్రదర్శన చేస్తామని భావిస్తున్నానని ధోని ధీమా వ్యక్తం చేశారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/