డ్రగ్స్‌ కేసు..ఎన్సీబీ విచారణకు హాజరైన దీపికా

deepika-padukone-reaches-ncb-office

ముంబయి: బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొణే ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచార‌ణ‌కు హాజ‌రైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ డ్రగ్స్ కోణం బయటపడ్డ సంగతి తెలిసిందే. దీంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్‌ రియా చక్రబర్తితో పాటు పలువురికి డ్రగ్స్ కేసులో సంబంధాలు ఉన్నాయని తేలింది. ఈ క్రమంలో దీపికాతో పాటు ప్రముఖ నటీమణులు శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌. రకుల్ ప్రీత్ సింగ్‌లతో పాటు ఈ కేసులో సంబంధమున్న వాళ్లకు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. అందులో భాగంగా సెప్టెంబర్ 26వతేదీన నార్కొటిక్సు కంట్రోల్ బ్యూరో అధికారుల దర్యాప్తునకు దీపికా హాజరైంది.

ముంబయిలోని కొల‌బా ప్రాంతంలో ఉన్న అపోలో బండ‌ర్ లోని ఎవ్లిన్ గెస్ట్‌హౌజ్‌లో దీపిక‌ను విచారిస్తున్నారు. నిన్న ర‌కుల్‌ను నాలుగు గంట‌ల పాటు ఎన్సీబీ అధికారులు విచారించారు. ఇవాళ సారా అలీఖాన్‌, శ్ర‌ద్ధాక‌పూర్‌ల‌ను ఎన్సీబీ పోలీసులు బ‌ల్లార్డ్ ఎస్టేట్‌లో విచారించ‌నున్నారు. దీపిక మేనేజ‌ర్ క‌రిష్మా ప్ర‌కాశ్‌ను శుక్ర‌వారం ప్ర‌శ్నించారు. ఆమెను ఇవాళ కూడా మ‌ళ్లీ విచారించే అవ‌కాశాలు ఉన్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/