పంత్ కి ఈ టీ20 కీలకమేనా?

ఆట తీరు మారకపోతే మార్పే ?

ఈరోజు బెంగళూరు లో ఆడనున్న టీ20 రిషబ్ పంత్ కి కీలకం కానుందా అంటే ముమ్మాటికీ కీలకమని చెప్పుకోవాలి. వరుసగా విఫలమవుతూ విమర్శల పాలవుతున్న రిషబ్ కి ఈ టీ20 కీలకమే. షాట్ల ఎంపిక లో తప్పిదాలు చేసి తన వికెట్ పోగొట్టుకుంటున్నాడని నెటిజన్లు ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటి వరకు తనకి చాల అవకాశాలే ఇచ్చారని అయినా తన ఆట తీరు మారటం లేదని సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆటలో మార్పు కనబడకపోతే పంత్ విషయం లో మార్పు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com/news/sports/