చెన్నై విజయభేరి…

csk won the match
csk won the match

రాజస్థాన్‌పై పోరాడి గెలిచిన సూపర్‌ కింగ్స్‌….
ధోని, రాయుడు సూపర్‌ ఇన్నింగ్స్‌…
జైపూర్‌: ఐపిఎల్‌ భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పోరాడి 4 వికెట్లతేడాతో గెలిచింది. రాయుడు, ధోని అర్థ సెంచరీలతో చెలరేగడంతో చెన్నై విజయభేరి మోగించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన రాజస్థాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌ అజింక్యా రహానె (14) నిరాశపరిచాడు. దీపక్‌ చాహర్‌ వేసిన మూడో ఓవర్‌లో రహానె ఎల్‌బిగా పెవిలియన్‌ చేరాడు. అటు తర్వాత జోస్‌ బట్లర్‌ (23) కాసేపు మెరుపులు మెరిపించినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. రాజస్థాన్‌ స్కోరు 47 పరుగుల వద్ద బట్లర్‌ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆపై సంజూ శాంసన్‌ (6), రాహుల్‌ త్రిపాఠి (10), స్మిత్‌ (15)లు సైతం విఫలమయ్యారు. కాగా, బెన్‌స్టోక్స్‌ (28) ఫర్వాలేదనిపించడంతో రాజస్థాన్‌ తేరుకుంది. చివర్లో పరాగ్‌ (16), జోఫ్రా ఆర్చర్‌ (13 నాటౌట్‌), శ్రేయస్‌ గోపాల్‌ (19)లు బ్యాట్‌ ఝళిపించడంతో రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, శార్థూల్‌ ఠాకూర్‌, రవీంద్రజడేజాలు తలో రెండు వికెట్లు సాధించగా, మిచెల్‌ సాంత్నార్‌కు ఒక వికెట్‌ దక్కింది. 151 పరుగుల విజయలక్ష్యంతో దిగిన చెన్నై ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింఇ. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ తొలి ఓవర్‌లోనే కులకర్ణి బౌలింగ్‌లో డకౌట్‌ కాగా, సురేశ్‌ రైనా రెండో ఓవర్‌లో రనౌటయ్యాడు.3.6వ బంతికి ఉన్కదత్‌ బౌలింగ్‌లో డుప్లెసిస్‌ (7) త్రిపాఠికి క్యాచ్‌ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆతర్వాత 5.5వ బంతికి కేదార్‌ జాదవ్‌ (1) జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆతర్వాత అంబటి రాయుడు, ధోని బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 95 పరుగులు చేశారు. ఈక్రమంలో 17.4వ బంతికి అంబటి రాయుడు (47బంతుల్లో 2ఫోర్లు, మూడు సిక్సులతో 57) స్టోక్స్‌ బౌలింగ్‌లోశ్రేయస్‌ గోపాల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. జట్టును గెలుపు అంచువరకు తీసుకొచ్చిన ధోని (43బంతుల్లో 2ఫోర్లు, మూడు సిక్సులతో 58) స్టోక్స్‌ బౌలింగ్‌లో చివరి ఓవర్‌లో బౌల్డయ్యాడు. అప్పటికి చెన్నై 3బంతుల్లో 5 పరుగులు చేయాల్సి ఉంది. చివరి బంతికి సిక్సు పడటంతో చెన్నై 20 ఓవర్లలో 155 పరుగులు చేసింది. చివర్లో రవీంద్ర జడేజా (9), మిచెల్‌ శాంట్నర్‌ (10) అజేయంగా నిలిచారు. రాజస్థాన్‌ బౌలర్లలో స్టోక్స్‌ 2, కులకర్ణి, ఉనద్కత్‌, ఆర్చర్‌ తలో వికెట్‌ తీశారు.

\

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/