ప్రమోటర్ల విభేదాలతో ఇండిగో పతనం!

Rahul Bhatia, Rakesh Gangwal
Rahul Bhatia, Rakesh Gangwal

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభం వివాదం ఇంకా ఒక కొలిక్కిరాకముందే మరో దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌లో విభేదాలు తలెత్తాయి. విస్తరణ వ్యూహాలు, వాటాదారుల ఒప్పందం అంశాలపై ప్రమోటర్లిద్దరి మధ్యతీవ్ర విభేదాలు వస్తున్నాయి. అలాగే సంస్థ నిర్వహణ, నియంత్రణకు సంబంధించిన అంశం, షేరు హోల్డర్స్‌ ఒప్పందంలో కొన్ని క్లాజెస్‌ విషయంలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయట. మరోవైపు జెట్‌ఎయిర్‌వేస్‌ మూసివేసిన తర్వాత ఇబ్బందుల్లో ఉన్న భారతీయ వైమానిక రంగానికి భారత్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్‌ మార్కెట్‌ కలిగిన ఇండిగో సంక్షోభం ప్రమాదకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. కీలక ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలతోపాటు నిర్వహణ స్థానాల్లోని ప్రవాస భారతీయుల నియామకాలపై విభేదాలున్నాయట. అంతేకాకుండా ఈ వ్యవహారం బహిర్గతం కాకముందే పరిష్కరించుకునే దిశగా జెఎస్‌ఎలా, ఖైతాన్‌ అండ్‌ కో సంస్థలను నియమించుకున్నారని ఒక పత్రిక నివేదించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/