జర్నలిస్టు ప్రియాపై నష్టపరిహార అభియోగాలు

priya ramani, journalist
priya ramani, journalist


హైదరాబాద్‌: మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ తనను లైంగికంగా వేధించాడని జర్నలిస్టు ప్రియమణి గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఐతే ఇవాళ ఆ కేసులో జర్నలిస్టు ప్రియాపై ఢిల్లీ హైకోర్టు నష్టపరిహార అభియోగాలు నమోదు చేసింది. దీనిలో భాగంగానే ఆమె అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరయ్యారు. తాను దోషిని కానని, విచారణకు సిద్ధంగా ఉన్నానని ఆమో చెప్పారు. గత ఏడాది మీటూ ఉద్యమంలో భాగంగా, జర్నలిస్టు ప్రియా రమణి, మాజీ జర్నలిస్టు ఎంజే అక్బర్‌పై లైంగిక దాడి ఆరోపణలు చేసింది. దాంతో అక్బర్‌ తన కేంద్ర మంత్రి పదవికి గత అక్టోబరు 17న రాజీనామా చేశారు. మళ్లీ మే 4వ తేదీన ఈ కేసులో విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో కోర్టు ముందు పర్సనల్‌గా హాజరు కావాల్సిన అవసరం లేదని కూడా కోర్టు ప్రియాకు మినహాయింపు కల్పించింది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/