‘గూగుల్‌’తో కోరుకున్న కోర్సులు

గూగుల్‌ యాడ్స్‌ డిస్‌ప్లే, షాపింగ్‌ యాడ్స్‌, గూగుల్‌ యాడ్స్‌ వీడియో, గూగుల్‌ యాడ్స్‌ సెర్చ్‌ తదితర ఎన్నో కోర్సులు ఉన్నాయి. ఇవన్నీ డిజిటల్‌ మార్కెటింగ్‌పై అవగాహన పెంచుకుని, పట్టుసాధించ డానికి ఉపయోగపడతాయి.

Google Searching
Google Searching

గూగుల్‌తో కలిసి కొన్ని ప్రసిద్ధ సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఎన్నో రకాల ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. డిజిటల్‌ మార్కెటింగ్‌ లాంటి కోర్సులను గూగుల్‌ రూపొందిస్తే, మిగిలిన వాటిని ప్రపంచస్థాయిలో పేరున్న సంస్థలు డిజైన్‌ చేశాయి. కోర్సు ఏదైనప్పటికీ ఒకే వేదికపై నేర్చుకునే సౌకర్యం ఉంది. వీటిలో వివిధ మాడ్యుళ్లు ఉన్నాయి. కోర్సును బట్టి గంట నుంచి 750 గంటల కాలవ్యవధి ఉంటుంది. ఏమాత్రం పూర్వ పరిచయం లేనివారు బేసిక్‌ కోర్సులను ఎంచుకోవచ్చు.

కొంత అవగాహన ఉన్నవారికి ఇంటర్మీడియట్‌, పట్టు సాధించడానికి అడ్వాన్స్‌డ్‌ స్థాయుల్లో కోర్సులు ఉన్నాయి. వీటిని పూర్తిచేసినవారు పరీక్ష రాసి డిజిటల్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు. ఇలా సంపాదించుకున్న సర్టిఫికేషన్ల వివరాలను సివీలో చేర్చి ఉద్యోగావకాశాలను మెరుగుపరచుకోవచ్చు. విద్యార్థులు, ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారు, కెరియర్‌ వృద్ధిని కోరుకునేవారు..ఈ మూడు వర్గాలకూ ఆన్‌లైన్‌ కోర్సులు ఉపయోగపడతాయి. వీ

టిలో చేరడానికి ఎలాంటి గడువూ లేదు. ఆసక్తిని బట్టి ఎప్పుడైనా, ఎవరైనా, ఎక్కడి నుంచైనా చేరవచ్చు. విద్యార్హతలతో సంబంధం లేదు. వీడియో పాఠాల సాయంతో నేర్చుకోవచ్చు. క్విజ్‌లు, ప్రాజెక్టులు, డిబేట్‌లు మొదలైనవీ ఉంటాయి. డేటా అండ్‌ టెక్నాలజీ, డిజిటల్‌ మార్కెటింగ్‌, కెరియర్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో మూడు విభాగాల్లో కోర్సులు అందిస్తున్నారు.

గూగుల్‌తోపాటు అప్లయిడ్‌ డిజిటల్‌ స్కిల్స్‌, కోర్స్‌ఎరా, వర్జిన్‌ యూనివర్సిటీ, డియాకిన్‌ యూనివర్సిటీ, ప్యూచర్‌ లెర్‌న, గుడ్‌విల్‌ కమ్యూనిటీ ఫౌండేషన్‌, మోనాష్‌ యూనివర్సిటీ, నేషనల్‌ చియావోటంగ్‌ యూనివర్సిటీ, ఓపెన్‌ క్లాస్‌ రూమ్స్‌, స్కిల్‌షాప్‌, ది ఓపెన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్లాండ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ గ్రోనింజన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకి తదితర సంస్థలు భాగస్వాములయ్యాయి. మాడ్యూల్‌ విజయవంతంగా పూర్తిచేస్తే డిజిటల్‌ బ్యాడ్జెట్స్‌ లభిస్తాయి. కొన్ని సంస్థలు పరీక్ష నిర్వహించి, సర్టిఫికెట్‌ ఇవ్వడానికి కొంత మొత్తం వసూలు చేస్తున్నాయి.

దాదాపు ఎక్కువ కోర్సులను ఉచితంగానే అందిస్తున్నారు. కొన్నింటికే నామమాత్రం రుసుంలు తీసుకుంటున్నారు. చిన్నచిన్న కోర్సులకు సర్టిఫికేషన్‌ పరీక్షలు ఉండవు. ఈ విభాగంలో కోర్సులు విద్యానేపధ్యంతో సంబంధం లేకుండా అందరికీ ఉపయోగపడతాయి. ఇందులో 53 కోర్సులున్నాయి. వాటిలో ఇంగ్లీష్‌ ఫర్‌ కెరియర్‌ డెవలప్‌మెంట్‌ కోర్సును పెన్సిల్వేనియా యూనివర్సిటీ అందిస్తోంది. ఇది బిగినర్స్‌కు ఉపయోగపడుతుంది.

దీన్ని 8 మాడ్యుళ్లలో 22 గంటల నిడివితో అందిస్తున్నారు. నాన్‌-నేటివ్‌ ఇంగ్లీష్‌ స్పీకర్ల కోసం ఉద్దేశించిన కోర్సు ఇది. ఉద్యోగాన్వేషణ, దరఖాస్తు చేసుకోవడం, ముఖాముఖికి హాజరుకావడం, పదసంపదను పెంచుకోవడం, భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవడం, రెజ్యూమో, కవర్‌ లెటర్‌ రూపొందించడం మొదలైనవన్నీ కోర్సులో భాగంగా నేర్చుకోవచ్చు. ఇదే సంస్థ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మెరుగు పరచుకోవడంపై 4 మాడ్యూళ్లలో 11 గంటల వ్యవధితో కోర్సును అందిస్తోంది. స్పీకింగ్‌ ఇన్‌ పబ్లిక్‌, బిజినెస్‌ కమ్యూనికేషన్‌, కమ్యూనికేటింగ్‌ ఐడియాస్‌, ఎఫెక్టివ్‌ నెట్‌వర్కింగ్‌ లాంటి కోర్సులు ఒక్కోదాన్ని గంట వ్యవధిలోనే పూర్తి చేసుకోవచ్చు.

మిచిగాన్‌ యూనివర్సిటీ అందించే ఇన్‌ప్లుయెన్సింగ్‌ పీపుల్‌ కోర్సులో 4 మాడ్యూళ్లు ఉన్నాయి. వీటిని 13 గంటల్లో పూర్తి చేయవచ్చు. తమ ఆలోచనలుపై స్థాయి వారికి ప్రభావపూరితం గా చెప్పడానికీ, కింది స్థాయివారిలో ప్రేరణ కలిగించడానికీ, అమ్మకాలు పెంచు కోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. తమను తాము ఎలా ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలో నేర్చుకోవచ్చు.

బిజినెస్‌ రైటింగ్‌, మోడల్‌ థింకింగ్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌, లాజికల్‌ అండ్‌ క్రిటికల్‌ థింకింగ్‌, లర్నింగ్‌ హౌ లర్న్‌, కెరియర్‌ ప్లానింగ్‌ డెవలప్‌మెంట్‌, సాఫ్ట్‌స్కిల్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌, గూగుల్‌ సాయంతో కొత్త ఉద్యోగం సాధించడం, సివి తయారీ, శాలరీ నెగోషియేషన్‌, ప్రొఫెషనల్‌ ఈ-మెయిల్స్‌ పంపడం తదితరాలను నేర్చుకోవచ్చు.

డిజిటల్‌ మార్కెటింగ్‌:

ఈ విభాగంలో 25 కోర్సులు ఉన్నాయి. డిజిటల్‌ మార్కెటింగ్‌పై ఆసక్తి ఉన్నవారు, అందులో కెరియర్‌ ఆశించేవారు ఫండమెంటల్స్‌ ఆఫ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ కోర్సులో చేరవచ్చు. దీన్ని గూగుల్‌ స్వయంగా అందిస్తోంది. ఇందులో 26 మాడ్యూళ్లు ఉంటాయి. ఇవి 40 గంటల్లో పూర్తవుతాయి. ఇంటరాక్టివ్‌ అడ్వర్టైజింగ్‌ బ్యూరో (ఐఎబి) గుర్తింపు పొందిన కోర్సు ఇది.

గూగుల్‌ శిక్షకులు వీటిని ప్రాక్టికల్‌ ఎక్సర్‌సైజ్‌లు, నిజజీవిత ఉదాహరణలతో వివరిస్తారు. డిజిటల్‌ మార్కెటింగ్‌ ప్రాథమికాంశాలపై పూర్తి పట్టు సాధించడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఆసక్తి ఉంటే డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఇతర కోర్సులూ చేయవచ్చు. మార్కెటింగ్‌ ఇన్‌ ఎ డిజిటల్‌ వరల్డ్‌ కోర్సును ఇలినాయిస్‌ సంస్థ అందిస్తోంది. ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్లు, 3డి ప్రింటింగ్‌..మొదలైనవాటిని ఉపయోగించి డిజిటల్‌ మార్కెటింగ్‌ను ఎలా విస్తరించవచ్చో వివరిస్తారు. ఉత్పత్తి సంస్థ నుంచి వినియోగదారుడికి చేరడానికి అవసరమైన నైపుణ్యాలను తెలుసుకోవచ్చు.

ఈ కోర్సును 4 మాడ్యూళ్లలో 30 గంటల వ్యవధితో నిర్వహిస్తున్నారు. అండర్‌స్టాండింగ్‌ ది వెబ్‌ కోర్సును రెండు మాడ్యూళ్లలో 4 గంటల వ్యవధితో, బిల్డ్‌ యువర్‌ ఆన్‌లైన్‌ బిజినెస్‌ను 8 మాడ్యూళ్లలో 8 గంటల వ్యవధితో అందిస్తున్నారు. గూగుల్‌ యాడ్స్‌ డిస్‌ప్లే, షాపింగ్‌ యాడ్స్‌, గూగుల్‌ యాడ్స్‌ వీడియో, గూగుల్‌ యాడ్స్‌ సెర్చ్‌ తదితర ఎన్నో కోర్సులు ఉన్నాయి.

ఇవన్నీ డిజిటల్‌ మార్కెటింగ్‌పై అవగాహన పెంచుకుని, పట్టుసాధించ డానికి ఉపయోగప డతాయి. కంటెంట్‌తో బిజినెస్‌ ప్రమోట్‌ చేయడం, కస్టమర్‌ సెగ్మెంటేషన్‌, హోస్ట్‌ డిజైన్‌ థింకింగ్‌ వర్క్‌షాప్‌, ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని ఆరంభించడం ఇలా ఎన్నో మెల కువలు నేర్పే కోర్సులున్నాయి. వెబ్‌సైట్ల నిర్వాహకులకు, వెబ్‌లో కెరియర్‌ ఆశించేవారికి ఈ కోర్సులు ఉపయోగపడతాయి.
ఈ విభాగం కింద 47 కోర్సులు లభిస్తున్నాయి.

అండర్‌ స్టాండింగ్‌ ది బేసిక్స్‌ ఆఫ్‌ కోడ్‌, మెషీన్‌ లర్నింగ్‌, ఇంప్రూవ్‌ యువర్‌ బిజినెస్‌ ఆన్‌లైన్‌ సెక్యూరిటీ కోర్సులను గూగుల్‌ అందిస్తోంది. ఇవి ఒక్కోటి గంట నిడివితో ఉన్నాయి. మెషీన్‌ లర్నింగ్‌ క్రాష్‌ కోర్సును 3 మాడూళ్లలో 15 గంటల వ్యవధితో పూర్తిచేసుకోవచ్చు.

బిగ్‌డేటా,మెషీన్‌ లర్నింగ్‌ ప్రాథమికాంశాలను 11 గంటల్లో నేర్చుకోవచ్చు. గ్రాఫిక్‌ డిజైన్‌పై ఆసక్తి ఉంటే కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ అందించే ఫండమెంటల్స్‌ ఆఫ్‌ గ్రాఫిక్‌ డిజైన్‌ కోర్సులో చేరవచ్చు. ఇది 4 మాడ్యూళ్లలో 14 గంటల వ్యవధితో పూర్తవుతుంది. ఈ కోర్సులో ఉన్న ఆప్షనల్స్‌ పూర్తిచేసినవారు మంచి గ్రాఫిక్‌ డిజైనర్లు కావడానికి అవకాశాలున్నాయి.

ప్రోగ్రామింగ్‌ ఫర్‌ ఎవ్రిబడీ కోర్సు మిచిగాన్‌ యూనివర్సిటీ అందిస్తోంది. ఇందులో పైథాన్‌ ఉపయోగించి ప్రోగ్రాం ఎలా రాయాలో నేర్పుతారు. ఇందుకోసం ప్రోగ్రామింగ్‌లో పూర్తి ప్రావీణ్యం అవసరం లేదు. గణితంలో ప్రీథమికాంశాలు, కంప్యూటర్‌ ఉపయోగించడం తెలిస్తే చాలు.

ఈ కోర్సు 7 మాడ్యూళ్లలో 12 గంటల్లో పూర్తవుతుంది. సెర్చింజిన్‌ ఆప్టిమైటన్‌ (ఎస్‌ఇవో). డిజిటల్‌ ప్రపంచలో ఎక్కువగా వినిపించేమాట. ఈ విభాగంపై ఆసక్తి ఉన్నవారు కాలిఫోర్నియా యూనివర్సిటీ రూపొందించిన ఎస్‌ఇవో ఫండమెంటల్‌ ఎటల్స్‌ కోర్సులో చేరవచ్చు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/