కరోనా వైరస్‌ పేరు మారింది… ‘కోవిడ్‌-19’

కరోనా అంటే కొన్ని వైరస్‌ల సమూహం.. ఆ గందరగోళాన్ని తొలగించేందుకే కొత్త పేరు పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

coronavirus
coronavirus

బీజింగ్‌: చైనాతో పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తూ వందలాదిమంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా వైరస్ పేరు మారింది. ప్రమాదకర ఈ వైరస్‌కు ‘కోవిడ్2019’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొత్త పేరు పెట్టింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ టెడ్రస్ అదానోమ్ తెలిపారు.
కోవిడ్-19 (covid-2019) అంటే ‘కరోనా వైరస్ డిసీజ్ 2019’ అని అర్థమని పేర్కొన్నారు. కొన్ని వైరస్‌ల సమూహానికి కరోనా అని పేరు ఉందని, దాంతో ఈ గందరగోళాన్ని తొలగించేందుకే కొత్త పేరు పెట్టినట్టు తెలిపారు. ఈ పేరు స్వతంత్రంగా ఏ ఒక్కదానినీ సూచించదని పేర్కొన్న టెడ్రస్.. ఈ కొత్త పేరు ఆ వ్యాధిని గురించి మాత్రమే తెలియజేస్తుందని స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/