ప్రపంచానికి కొవిడ్‌-19 తీవ్రమైన ముప్పు

కరోనా వ్యాప్తిని ఆరికట్టడంలో సంపన్న దేశాలు..పేద దేశాలకు సాయం చేయాలి

bill gates
bill gates

షికాగో: ప్రపంచానికి కొవిడ్‌-19 తీవ్రమైన ముప్పు అని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అన్నారు. గతంలో వచ్చిన వైరస్‌లతో పోలిస్తే కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉందని అన్నారు. కొవిడ్‌ -19 మహమ్మారి శతాబ్ధంలో ఒకసారి వచ్చే అత్యంత వ్యాధికారక వైరస్‌ అని అన్నారు. ఈ వైరస్‌ వ్యాప్తిని ఆరికట్టడంలో అభివృద్ధి చెందిన దేశాలు..పేద దేశాలకు సాంకేతికంగా, వైద్య పరంగా సాయం చేయాలని ఆయన అభ్యర్థించారు. పేద, మధ్య తరగతి దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అలాంటి దేశాలపై కరోనా లాంటి వైరస్‌లు తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. అందుకే ఆయా దేశాల్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంపన్న దేశాలు తమవంతు సహకారం అందించాలన్నారు. ఇందుకోసం ప్రపంచదేశాలు దౌత్యపరమైన ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. మందులు, వ్యాక్సిన్లపై మరింత ఖర్చుపెట్టాలి. అప్పుడే వైరస్‌ల వ్యాప్తిని ఆరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడగలం అని గేట్స్‌ తన కథనంలో పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/