పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమం

Healthy baby born to COVID-19 positive woman at AIIMS
Healthy baby born to Corona positive woman at AIIMS

New Delhi: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో  ఓ కరోనా బాధితురాలు పడంటి బిడ్డకు జన్మనిచ్చింది. దేశంలో ఇదే తొలి ఘటన. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

తల్లీబిడ్డ ఆరోగ్యంతా ఉన్నారని వైద్యులు ప్రకటించడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.

తల్లి నుంచి బిడ్డకు వైరస్ సోకి ఉంటుందా అని చర్చ సాగుతోంది.

అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఉత్కంఠ ఏర్పడింది.

అయితే ఆ విధంగా సోకే అవకాశాలు చాలా తక్కువ అని వైద్యులు చెబుతున్నారు.

అయితే ఆ బిడ్డకు తల్లిపాలు ఇవ్వడంతో ఆ వైరస్ సోకే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఆ బిడ్డకు కరోనా లక్షణాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు.

ఈ క్రమంలో ఆ బిడ్డను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కరోనా లక్షణాలు తేలితే పాప ప్రాణానికే ప్రమాదం ఉండవచ్చని అనుమానంతో వైద్యులు అప్రమత్తంగా ఉన్నారు.

వాస్తవంగా ఆమె డెలివరీకి ఇంకా వారం రోజుల సమయం ఉండగా, శుక్రవారం ఆమెకు నొప్పులు రావడంతో ఆమెను వెంటనే ఎయిమ్స్ లో చేర్పించారు.

ఆమెకు అతికష్టం మీద ప్రసవం చేశారు. శస్త్ర చికిత్స చేసి పండంటి మగబిడ్డను బయటకు తీశారు.

ఇప్పటివరకు అయితే ఆ బిడ్డకు కరోనా లక్షణాలేవీ లేవని వైద్య నిపుణురాలు నీర్జా భట్ల తెలిపారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/